Just In
- 4 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 6 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 9 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 11 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- Sports
ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: టామ్ లాథమ్
- News
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీల నిషేధంపై ఏపీ హైకోర్టులో..!!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Movies
బడా తమిళ హీరోలపై ఫోకస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్.. దిల్ రాజు కంటే హై లెవెల్ కాంబినేషన్స్!
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 3జిబి డేటా, అపరిమిత కాల్స్, తక్కువ ధర..
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన కస్టమర్లకు రూ.299 ప్లాన్‌లో అందిస్తున్న డేటా లిమిట్‌ను పెంచింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా లభ్యం కాగా ప్రస్తుతం దీన్ని 1జీబీ పెంచారు. దీంతో ఇప్పుడీ ప్లాన్‌లో రోజుకు 3జీబీ మొబైల్ డేటాను యూజర్లు పొందవచ్చు. ఇక ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, కాంప్లిమెంటరీ జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ యథావిధిగా లభిస్తున్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉండడంతో మొత్తం అన్ని రోజులకు కలిపి జియో కస్టమర్లకు 84 జీబీ డేటా లభిస్తుంది.

రూ.398 లేదా ఆపైన విలువ గల ప్యాక్‌తో..
ఇదిలా ఉంటే జియో ప్రైమ్ వినియోగదారులు రూ.398 లేదా ఆపైన విలువ గల ప్యాక్‌తో రీచార్జి చేసుకుంటే వారికి రూ.799 విలువైన బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ.400 విలువైన 8 ఓచర్లు వస్తాయి. ఒక్కో ఓచర్ విలువ రూ.50 ఉంటుంది. వీటిని తదుపరి చేసుకునే రీచార్జిలపై ఉపయోగించుకుని ఆమేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. కాగా ఒకసారి ఒక ఓచర్‌ను మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది.

మొబిక్విక్, పేటీఎం, అమెజాన్ పే, ఫోన్ పే, ఫ్రీ చార్జ్, యాక్సిస్ పే ..
ఇక మిగిలిన రూ.399 క్యాష్‌బ్యాక్ ఆయా వాలెట్స్ ద్వారా కస్టమర్లకు లభిస్తుంది. మొబిక్విక్, పేటీఎం, అమెజాన్ పే, ఫోన్ పే, ఫ్రీ చార్జ్, యాక్సిస్ పే తదితర వాలెట్లలో ఈ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మొబిక్విక్ ద్వారా రూ.398 ఆపైన విలువ గల ప్లాన్‌ను రీచార్జి చేసుకునే వారికి రూ.2500 విలువ గల హోటల్ ఓచర్ లభిస్తుంది. ఇక పేటీఎం ద్వారా రీచార్జి చేసుకుంటే సినిమా టిక్కెట్లపై 50 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

రూ.11, రూ.21, రూ.51, రూ.101తో..
వీటితో పాటు రూ.11, రూ.21, రూ.51, రూ.101 రీచార్జి విలువ కలిగిన 4 కొత్త యాడాన్ ప్యాక్‌లను విడుదల చేసింది. ఇప్పటికే జియోకు చెందిన పలు ప్లాన్లను వాడే వారు తమ ప్లాన్‌లో లభించే మొబైల్ డేటా మొత్తం అయిపోతే అప్పుడు ఈ డేటా ప్యాక్‌లను వాడుకోవచ్చు. అయితే వీటికి వాలిడిటీ అంటూ ఏదీ ఉండదు. వినియోగదారులు వాడే ప్లాన్‌కు ఉన్న వాలిడిటీయే వీటికీ వర్తిస్తుంది.

ఈ ప్యాక్‌లు ఎన్నింటినైనా..
ఇక ఈ ప్యాక్‌లలో రూ.11 ద్వారా కస్టమర్లకు రూ.400 ఎంబీ డేటా వస్తుంది. అదే రూ.21 అయితే 1జీబీ డేటా, రూ.51 అయితే 3 జీబీ డేటా, రూ.101 అయితే ఏకంగా 6 జీబీ డేటా వస్తుంది. ఈ ప్యాక్‌లు ఎన్నింటినైనా యూజర్లు రీచార్జి చేసుకోవచ్చు.

యో యాప్, వెబ్‌సైట్‌లలో..
కాకపోతే అవి వెంటనే యాక్టివేట్ అవవు. యూజర్లు తమ జియో అకౌంట్‌లోకి వెళ్లి ఒకసారి ఒక ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రీచార్జిలను ప్రస్తుతం జియో కస్టమర్లు జియో యాప్, వెబ్‌సైట్‌లలో చేసుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470