రూ.200లోపు లభించే జియో ప్లాన్స్ పై ఓ లుక్కేయండి
జియో ప్రీపెయిడ్ యూజర్ కోసం అదిరే ప్లాన్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టిస్తూ వచ్చిన ఈ ప్లాన్లకు టాప్ టెల్కోలు రీ కౌంటర్ వేస్తూ ధరల యుద్దానికి తెరలేపుతున్నాయ
జియో ప్రీపెయిడ్ యూజర్ కోసం అదిరే ప్లాన్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టిస్తూ వచ్చిన ఈ ప్లాన్లకు టాప్ టెల్కోలు రీ కౌంటర్ వేస్తూ ధరల యుద్దానికి తెరలేపుతున్నాయి. ఈ నేపథ్యంలో జియో వాడుతున్న యూజర్ల కోసం రూ.200లోపు లభించే బెస్ట్ ప్లాన్స్ ను తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

జియో రూ.19 ప్లాన్
రూ.19 ప్లాన్‌తో మీకు 0.15జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 20 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 1రోజు మాత్రమే.

జియో రూ. 52 ప్లాన్
రూ.52 ప్లాన్‌తో రోజుకు 0.15జీబీ డేటా చొప్పున లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 70 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 7రోజులు మాత్రమే.

జియో రూ. 98 ప్లాన్
రూ.98 ప్లాన్‌తో 2జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్,100 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.

జియో ప్లాన్ 149
రూ.149 ప్లాన్‌తో రోజుకు 1.5జీబీ డేటా చొప్పున లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28రోజులు మాత్రమే.

జియో ప్లాన్ 198
రూ.198 ప్లాన్‌తో రోజుకు 2జీబీ డేటా చొప్పున లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28రోజులు మాత్రమే.

జియోఫోన్ హంగామా ఆఫర్...
జియోఫోన్ హంగామా ఆఫర్ క్రింద ఈ కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జియో తెలిపింది. అంటే, ఈ గిఫ్ట్ కార్డ్ ఆఫర్‌ను పొందాలనుకునే యూజర్లు తమ పాత జియోఫోన్‌లను కొత్త వాటితో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవల్సి ఉంటుంది. యాజర్లు ఈ గిఫ్ట్ కార్డును కొనుగోలు చేసిన తరువాత సమీపంలోని రిలయన్స్ డిజిటల్ లేదా జియో స్టోర్‌కు వెళ్లి, ఆ గిఫ్ట్ కార్డును చూపించి తమ పాత ఫోన్‌ను కొత్త ఫోన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవల్సి ఉంటుంది. ఎక్స్‌ఛేంజ్ చేసే జియోఫోన్ పూర్తిస్థాయిలో వర్కింగ్ కండీషన్‌లో ఉండాలి. ఫోన్‌తో పాటు ఛార్జర్‌ను కూడా ఇవ్వవల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








