JioStar Plans జియోస్టార్ ఓటీటీ ప్లాన్‌లు విడుదల.. రూ.15 నుంచే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు..!
రిలయన్స్‌కు చెందిన జియోసినిమా (Jio Cinema), వాల్ట్ డిస్నీ సంస్థ డిస్నీ + హాట్‌స్టార్ (Disney + Hotstar) విలీనం ఈ నెల 14వ తేదీన పూర్తి అయింది. కొత్తగా జియోస్టార్ (JioStar.com) ఓటీటీ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా దేశంలో అతి పెద్ద డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థగా నిలిచింది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రెండు సంస్థల విలీనంతో అందుబాటులోకి వచ్చిన కొత్త సంస్థ విలువ రూ.70,352 కోట్లుగా ఉంది.
జియోస్టార్‌లో ఎవరి వాటా ఎంత ?
జియోస్టార్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఫలితంగా 6.34 శాతం వాటాలను దక్కించుకుంది. దీంతోపాటు వయాకామ్ 18.. 46.82 శాతం వాటాను పొందింది. డిస్నీ 36.84 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జియోస్టార్ కు ఛైర్‌పర్సన్ గా నీతా అంబానీ, వైస్ ఛైర్మన్ గా ఉదయ్ శంకర్ నియామకం అయ్యారు. రెండు సంస్థల విలీనంతో అనేక ఛానళ్లు ఒకే సంస్థ కిందకు వచ్చాయి.

తాజాగా జియోస్టార్ ఓటీటీ (JioStar) వివిధ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లను వెల్లడించింది. ఈ ప్లాన్ ధరలు రూ.15 నుంచి ప్రారంభం కావడం విశేషం. స్టాండర్డ్ డెఫినిషన్ (SD), హై డెఫినిషన్ (HD), కిడ్స్ ఛానళ్ల వారీగా ధరల వివరాలను వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచింది. అయితే ఇతర సంస్థలతో పోలిస్తే జియోస్టార్ ధరలు తక్కువగా ఉన్నాయి.
స్టాండర్డ్ డెఫినిషన్ (SD) నెలవారీ ప్లాన్లు :
స్టార్ వ్యాల్యూ ప్యాక్ ఒడియా హింది మిని : రూ.15
స్టార్ వ్యాల్యూ ప్యాక్ కన్నడ హిందీ మిని : రూ.45
స్టార్ వ్యాల్యూ ప్యాక్ హిందీ : రూ.59
స్టార్ వ్యాల్యూ బెంగాలీ హిందీ : రూ.65
స్టార్ వ్యాల్యూ ప్యాక్ మరాఠి హిందీ : రూ.67
స్టార్ ప్రీమియం ప్యాక్ హిందీ : రూ.105
స్టార్ ప్రీమియం ప్యాక్ మరాఠి హిందీ : రూ.110
స్టార్ ప్రీమియం ప్యాక్ బెంగాళీ హిందీ : రూ.110
కిడ్స్ ఛానళ్ల నెలవారీ ప్లాన్ లు :
డిస్నీ కిడ్స్ ప్యాక్ : రూ.15
డిస్నీ హంగామా కిడ్స్ ప్యాక్ : రూ.15
హై డెఫినిషన్ నెలవారీ ప్లాన్లు :
స్టార్ వ్యాల్యూ ప్యాక్ లైట్ HD హిందీ : రూ.88
స్టార్ ప్రీమియం ప్యాక్ లైట్ HD : రూ.125
స్టార్ వ్యాల్యూ ప్యాక్ మరాఠి లైట్ హిందీ HD : రూ.99
డిస్నీ కిడ్స్ ప్యాక్ HD : రూ.18
డిస్నీ హంగామా కిడ్స్ ప్యాక్ HD : రూ.18
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులతో జియోస్టార్ ప్లాట్‌ఫాం (JioStar OTT) రాణించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంటెంట్, మెరుగైన స్ట్రీమింగ్ అనుభూతిని డిజిటల్ ప్లాట్‌ఫాం యూజర్‌లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పెద్ద డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ గా ఏర్పాటైన నేపథ్యంలో ప్రస్తుత ఉన్న ప్లాట్‌ఫాం లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. విలీనానికి ముందు జియోసినిమా 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు, డిస్నీ + హాట్‌స్టార్ 500 మిలియన్ డౌన్‌లోడ్స్ ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








