Home
News

స్మార్ట్‌టీవీల కోసం JioTele OS.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కంటెంట్‌ సిఫార్సులు.. ఫిబ్రవరి 21 నుంచి!

ప్రముఖ సంస్థ జియో.. స్మార్ట్‌టీవీ యూజర్ల కోసం కొత్త OS ను విడుదల చేసింది. జియోటెలీ OS (JioTele OS) పేరుతో తీసుకొచ్చింది. స్మార్ట్‌ టీవీ కంటెంట్‌ను యూజర్లకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడం సహా లోకల్‌ కంటెంట్‌ను అందించడం ఈ కొత్త OS తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశమని జియో వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారంగా కంటెంట్‌ను సిఫార్సు చేస్తుందని తెలిపింది.

OTT యాప్‌ల సపోర్టు :
జియోటెలీ OS భవిష్యత్‌లో అనేక అప్‌డేట్‌లను పొందుతుందని జియో తెలిపింది. దీంతోపాటు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ అనేక OTT యాప్‌లను సపోర్టు చేస్తుంది. స్మార్ట్‌ టీవీల్లో క్లౌడ్‌ ఆధారిత గేమ్స్‌కు ఈ OS సపోర్టు చేస్తుంది. దీంతోపాటు అనేక ఫీచర్‌లను ఒకే రిమోట్‌తో నియంత్రించగలరని జియో తెలిపింది.

jioTele OS launched for smart TVs in india

ఫిబ్రవరి 21 నుంచి :
దీంతోపాటు ఈ కొత్త జియో ఓఎస్‌తో తక్కువ ధరలో ప్రీమియం కంటెంట్‌ను వీక్షించవచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి జియోటెలీ OS తో పనిచేసే స్మార్ట్‌టీవీలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి BPL, థామ్సన్‌, కోడక్‌, JVC వంటి సంస్థల టీవీలు ఈ OS తో సపోర్టు చేయనున్నాయి.

ల్యాగ్‌ ఫ్రీ కంటెంట్‌ :
త్వరలో మరిన్ని మోడళ్లు ఈ జియో OS తో అందుబాటులోకి రానున్నాయని జియో తెలిపింది. ప్రస్తుతం దీనిపైన పనిచేస్తున్నట్లు పేర్కొంది. జియోటెలీ OS మెరుగైన పనితీరు అందిస్తుందని సంస్థ చెబుతోంది. 4K కంటెంట్‌ వీక్షించే సమయంలోనూ ల్యాగ్‌ ఫ్రీ కంటెంట్‌ సాధ్యమవుతుందని తెలిపింది.

సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా కంటెంట్‌ను సిఫార్సులు చేస్తుంది. అయితే దేని ఆధారంగా ఈ సిఫార్సులు చేస్తుందనే వివరాలను జియో వెల్లడించలేదు. ఈ OS క్రమంగా తప్పకుండా సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా పొందుతుంది. ఫలితంగా కొత్త యాప్స్‌ను కూడా OS సపోర్టు చేస్తుంది.

** గత వారం వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియా జాయింట్ వెంచర్‌ OTT ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇందులో 3 లక్షల గంటల కంటెంట్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జియోసినిమా, డిస్నీ + హాట్‌స్టార్‌ యూజర్లకు ఈ కంటెంట్‌ అందుబాటులోకి వచ్చింది.

రూ.149 ప్రారంభ రీఛార్జ్‌తో సబ్‌స్ర్కిప్షన్‌ ప్లాన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రీమియం నెలవారీ రీఛార్జ్‌ ప్లాన్ ధర రూ.299 గా ఉంది. అదే సంవత్సరానికి రూ.1499 తో రీఛార్జ్‌ ప్లాన్‌ను విడుదల చేసింది. 10 భారతీయ భాషల్లో కంటెంట్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

జియో హాట్‌స్టార్‌ OTT ప్లాట్‌ఫాం నెట్‌ఫిక్స్, అమెజాన్ ప్రైమ్, ZEE5, సోనీలివ్‌ వంటి ప్లాట్‌ఫాంలకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త ప్లాట్‌ఫాంకు అనుగుణంగా టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లా్న్‌లను విడుదల చేశాయి.

జియో రూ.949 రీఛార్జ్‌ ప్లాన్‌తో జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 90 రోజులపాటు వ్యాలిడిటీని అందిస్తోంది. దీంతోపాటు 2GB 4G డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
jioTele OS launched for smart TVs in india and users get AI based recommendations
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X