Just In
- 13 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 15 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 18 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 19 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- Automobiles
హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ గురించి పూర్తి వివరాలు - ఇక్కడ చూడండి
- Finance
Zomato: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫుడ్ డెలివరీ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు
- News
vastu tips: నైరుతి అభిముఖంగా ఇల్లు.. ఈ వాస్తు నివారణలతో ఇకపై అశుభం కాదు!!
- Movies
Pathaan షారుక్ బాక్సాఫీస్ రచ్చ.. బాహుబలికి రికార్డుకు చేరువగా.. తొలి రోజే 100 కోట్లు?
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Jio యూజర్లు క్రికెట్ లైవ్ ని మిస్ అవ్వరు!! వాచ్‌పార్టీతో మిత్రులతో కలిసి చూడటానికి అనుమతి...
రిలయన్స్ జియో తన యొక్క వినియోగదారుల కోసం జియోటీవీ పేరుతో సొంత లైవ్ టీవీ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తున్నది. ఈ ప్లాట్‌ఫారమ్‌కు యాక్సెస్ యాక్టివ్ దశలో ఉన్న జియో కస్టమర్‌లకు మాత్రమే అందించబడుతుంది. మీరు దీన్ని ఉపయోగించడానికి జియోటీవీ యాప్‌లో మీ జియో నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఇండియాలో క్రికెట్ కి గల ఆదరణ మరొక స్పోర్ట్స్ కి లేదు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా టీవీలకు అతుకొనిపోతూ ఉంటారు.

ప్రస్తుతం జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల ఉత్కంఠభరితమైన సిరీస్‌ను మీరు కూడా అనుసరిస్తున్నట్లయితే కనుక వన్డే సిరీస్‌లోని మూడవ మ్యాచ్‌ని వీక్షించడం కోసం మీరు పరితపిస్తుంటే కనుక 'జియో వాచ్ పార్టీ' లో భాగస్వామ్యం కావచ్చు. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఇండియా ఒక మ్యాచ్, ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ లో విజయం సాధించాయి. మిగిలిన మూడవ వన్డే మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తే ట్రోఫీని ఆ జట్టు సొంతం చేసుకుంటుంది. మీరు మీ స్నేహితులు చాలా దూరంలో నివసిస్తుంటే కనుక వారితో కలిసి థ్రిల్లర్‌ను ఆస్వాదించాలనుకుంటే కనుక జియో వాచ్ పార్టీ మీ యొక్క కోరికను కవర్ చేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

JioTV వాచ్‌పార్టీ ఫీచర్‌ని ఉపయోగించే విధానం
రిలయన్స్ జియోతో కలిసి మీరు భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడవ వన్డేను చూడగలరు. ఇందుకోసం మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో జియోటీవీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి అందులో మీ జియో నెంబర్ తో లాగిన్ అవ్వాలి. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత దాన్ని మీ ఫోన్ లో క్రికెట్ మ్యాచ్ యొక్క లైవ్ ప్రసారం చేయబడుతుంది. తర్వాత మీ స్క్రీన్ దిగువన 'వాచ్‌పార్టీ' పేరుతో గల చిన్న సర్కిల్ రకమైన పోస్టర్‌ని మీరు చూస్తారు.

వాచ్‌పార్టీ పోస్టర్ మీద క్లిక్ చేయడంతో మీరు రెండు ఎంపికలను పొందుతారు. మొదటి ఎంపిక కొత్త పార్టీని సృష్టించడం మరియు రెండవది లింక్‌ని ఉపయోగించి ఇప్పటికే ఉన్న పార్టీలో చేరడం. ఈ రెండిటిలో ఏదైనా ఒక ఎంపికను ఎంచుకోవడంతో మీరు జియోటీవీ ద్వారా మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్‌ను చూడవచ్చు.

జియోమీట్ అనేది కస్టమర్‌ల కోసం జియోటీవీలో వాచ్‌పార్టీని ప్రారంభించిన ప్లాట్‌ఫారమ్. జియోమీట్ అనేది రిలయన్స్ జియో యాజమాన్యంలోని ప్రతి ఒక్కరి కోసం రూపొందించిన వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్. ఇది మిలియన్ల మంది భారతీయులను ఒకచోట చేర్చే లక్షణంతో రూపొందించబడింది. నిర్ణీత సమయంలో ఎంత మంది వ్యక్తులు వాచ్‌పార్టీలో చేరవచ్చనే దానిపై ఎటువంటి నిర్ధారణ లేదు. అయితే దీన్ని తనిఖీ చేయడం కోసం మీరే ప్రయత్నించండి.

మీ యొక్క డివైస్ లో ఇప్పటికే జియోటీవీ యాప్ లేకపోతే కనుక మీరు దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్ లలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి మరియు iOSలో యాప్ స్టోర్ నుండి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జియోటీవీ యాప్‌లో అన్ని లైవ్ కంటెంట్ యూజర్‌లు కలిసి చూడగలిగే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ లైవ్ క్రికెట్ లో మాత్రం ఖచ్చితంగా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. జియో యూజర్లు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్ లతో రీఛార్జ్ చేయడం ద్వారా జియోటీవీని ఉచితంగా యాక్సిస్ చేయడానికి టెల్కో అనుమతిని ఇస్తుంది.

జియోకాల్ యాప్
రిలయన్స్ జియో సంస్థ 2G/3G స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న వారు VoLTE కాల్స్ చేయడానికి వీలుగా ఇటీవల జియోకాల్ అనే యాప్‌ను విడుదల చేసింది. మీ 4G స్మార్ట్‌ఫోన్ VoLTEకి మద్దతు ఇవ్వకపోయినా కూడా మీరు HD కాల్‌లు చేయడం కోసం జియోకాల్ యాప్‌ని ఉపయోగించవచ్చు. జియోకాల్ యాప్ యొక్క అత్యంత ముఖ్యమైన ఫీచర్లల విషయానికి వస్తే వినియోగదారులు HD వాయిస్ మరియు వీడియో కాల్‌లు చేయడానికి వీలు కల్పించడం లక్ష్యంగా చేసుకున్నది. వినియోగదారులు JioFi డివైస్ ని కలిగి ఉంటే కనుక వారు తమ 2G/3G స్మార్ట్‌ఫోన్‌లో జియోకాల్ యాప్‌ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడమే కాకుండా మొబైల్ ప్రొఫైల్‌ను కూడా కాన్ఫిగర్ చేయవచ్చు. JioFi నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయడం ద్వారా వినియోగదారులు వారి 2G/3G స్మార్ట్‌ఫోన్‌ల నుండి HD వాయిస్ మరియు వీడియో కాల్స్ చేయవచ్చు. ఇందులో గల మరొక మంచి విషయం ఏమిటంటే వినియోగదారులు HD కాల్‌లు చేయడానికి ఫోన్ లోని డయలర్ యాప్‌ను నేరుగా ఉపయోగించవచ్చు. అలా చేయడానికి వారు ప్రతిసారీ JioCall యాప్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. జియోకాల్ యాప్ గరిష్టంగా ఆరుగురితో కాన్ఫరెన్స్ వాయిస్ కాల్‌లో పాల్గొనడానికి అనుమతిస్తుంది. అలాగే గరిష్టంగా నలుగురు వ్యక్తులతో వీడియో కాన్ఫరెన్స్‌ని చేయడానికి కూడా అనుమతిస్తుంది.

లడఖ్‌లో జియో 4G నెట్‌వర్క్ కవరేజ్
లడఖ్‌లో రిలయన్స్ జియో తన 4G నెట్‌వర్క్‌లను విస్తరించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలోని ప్రతి భాగానికి 4G నెట్‌వర్క్ చేరుకునేలా టెల్కో ఉద్యోగులు కఠినమైన లోయ ప్రాంతాలలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను అధిగమించి పనిచేసారు. మే 2022లో ఖాల్సీ బ్లాక్‌లోని కంజి, ఉర్బిస్ & హనుపట్టా గ్రామాలు మరియు డిస్కిట్ బ్లాక్‌లోని చుంగ్‌లుంగ్‌ఖా గ్రామం వంటి ప్రదేశాలలో జియో 4G నెట్‌వర్క్ సేవలను కూడా ప్రారంభించింది. లేహ్‌లో కూడా రిలయన్స్ జియో వినియోగదారులకు జియోఫైబర్ సేవలను అందిస్తోంది. లడఖ్‌లో పర్యటించే జియో వినియోగదారులు తమ ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండటానికి బలమైన నెట్‌వర్క్ కనెక్షన్‌ని పొందేలా ఇది నిర్ధారిస్తుంది. టెల్కో ఇటీవలే కేదార్‌నాథ్‌లో 4G నెట్‌వర్క్ సేవలను అందించడం ప్రారంభించింది. దీని కారణంతో అక్కడికి వచ్చే యాత్రికులు తమకు నచ్చిన వారితో కనెక్ట్ చేయడం మరింత సులభం చేస్తుంది. ఇటీవల లాభదాయకత ఆందోళనల కారణంగా ఇతర ప్రైవేట్ టెల్కోలు లేని ప్రాంతాలపై జియో దృష్టి సారిస్తోంది. దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్‌లలో ఒకదాని నుండి 4G నెట్‌వర్క్ సేవను ఎట్టకేలకు పొందగలుగుతున్నందున లడఖ్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. ఇది పాంగోంగ్ సరస్సు మరియు స్పాంగ్మిక్ గ్రామాన్ని సందర్శించడంలో పర్యాటకుల విశ్వాసాన్ని పెంచుతుంది. ఇది భవిష్యత్తులో వాణిజ్యానికి మంచి అవకాశాలను కలిగిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470