నిరుద్యోగులకు శుభవార్త, Paytmలో 5000 ఉద్యోగాలు

డిజిటల్‌ పేమెంట్‌ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం Paytm Mall నిరుద్యోగులకు శుభవార్తను మోసుకొచ్చింది.

|

డిజిటల్‌ పేమెంట్‌ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం Paytm Mall నిరుద్యోగులకు శుభవార్తను మోసుకొచ్చింది. పేటీఎమ్ మాల్ సొంతమైన Paytm Ecommerce Pvt. Ltd ద్వారా 5000 మంది ఉద్యోగులను కంపెనీలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. సెకండ్ క్యాంపస్ ఐకాన్‌ ప్రొగ్రామ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. అతి త్వరలోనే గ్రాడ్యుయేట్ల కోసం అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు పేటీఎం మాల్‌ పేర్కొంది. ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో దాదాపు 5000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్టు తెలిపింది.

 

జియో రూ.501 ఫోన్ పూర్తి స్కీమ్ వివరాలు, ఆఫర్లు తెలుసుకోండిజియో రూ.501 ఫోన్ పూర్తి స్కీమ్ వివరాలు, ఆఫర్లు తెలుసుకోండి

ఈ ఎడిషన్‌లో భాగంగా..

ఈ ఎడిషన్‌లో భాగంగా..

ఈ ఎడిషన్‌లో భాగంగా విద్యార్థులకు టెక్నాలజీ, మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగాల్లో వారి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను చేపట్టనుంది.

అక్టోబర్‌ 10న..

అక్టోబర్‌ 10న..

వీటిలో టాప్‌ పర్‌ఫార్మెర్స్‌ జాబితాను అక్టోబర్‌ 10న పేటీఎం మాల్‌ ప్రకటించనుంది. వీరికి లక్ష రూపాయల వరకు నగదు బహుమతితో పాటు, పేటీఎం మాల్‌లో ఫుల్‌-టైమ్‌ ఉద్యోగాన్ని కూడా ఆఫర్‌ చేస్తోంది.

2017లో..

2017లో..

ఈ ప్రొగ్రామ్‌ను తొలుత 2017లో లాంచ్‌ చేశారు.ఆ పోగ్రామ్ లో సత్తా ఉన్న 2200 మంది విద్యార్థులకి తన కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చింది. వారిని పర్మినెంట్ కింద కంపెనీ నియమించుకుంది.

వందల కొద్ది గ్రాడ్యుయేట్లు
 

వందల కొద్ది గ్రాడ్యుయేట్లు

మా క్యాంపస్‌ ఐకాన్‌ ప్రొగ్రామ్‌ ప్రారంభ ఎడిషన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో వందల కొద్ది గ్రాడ్యుయేట్లు పాల్గొని విజయవంతం చేశారు. ఈ ఏడాది కూడా మరింత మంది విద్యార్థులను చేరుకోవాలనుకుంటున్నాం. దేశంలోనే ఇది అతిపెద్ద క్యాంపస్‌ ఐకాన్‌' అని పేటీఎం మాల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌సిన్హా తెలిపారు.

తర్వాతి తరం యువ ప్రొఫెషనల్స్‌కు..

తర్వాతి తరం యువ ప్రొఫెషనల్స్‌కు..

ఈ ప్రొగ్రామ్‌తో తర్వాతి తరం యువ ప్రొఫెషనల్స్‌కు మంచి అనుభవం కల్గిస్తుందని, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు, ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదో అపూర్వ అవకాశమని అన్నారు.

ఆఫ్‌లైన్‌ మర్చెంట్ల వ్యాపార వృద్ధిని..

ఆఫ్‌లైన్‌ మర్చెంట్ల వ్యాపార వృద్ధిని..

కస్టమర్ల రోజువారీ కార్యకలాపాల్లో పాలుపంచుకునే ఆఫ్‌లైన్‌ మర్చెంట్ల వ్యాపార వృద్ధిని పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. డిజిటల్ పేమెంట్ రంగంలో అతి పెద్ద పేమెంట్ వ్యాలెట్ గా దూసుకుపోతోంది.

రూ.2900 కోట్ల ఫండ్స్‌ను

రూ.2900 కోట్ల ఫండ్స్‌ను

గత ఏప్రిల్ నెలలో కంపెనీ రూ.2900 కోట్ల ఫండ్స్‌ను సేకరించింది. ఇందులో SB Investment Holdings (UK) and its affiliates (including SoftBank Vision Fund)ల నుండి రూ. 2,600 కోట్లు సింగపూర్ ఈ కామర్స్ ఆలిబాబా కంపెనీ Alibaba.com నుంచి రూ. 292.5 కోట్లు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Job alert: Paytm Mall to hire 5,000 college graduates, details inside more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X