నిన్నసెక్స్ రోబో.. నేడు హెలికాఫ్టర్ రోబో!

Posted By: Staff

 నిన్నసెక్స్ రోబో.. నేడు హెలికాఫ్టర్ రోబో!

 

టెక్నాలజీ పై పూర్తి స్థాయిలో ఆధారపడుతన్న నేటి ఆధునిక యుగంలో అనేక సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి..సాంకేతికత సాయంతో మానవుడు అనేకమైన అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నాడు. సురక్షత శృంగారాన్ని ప్రోత్సహించే క్రమంలో ఇటీవల సెక్స్ రోబోలను రూపొందించిగా, తాజాగా ఆరోగ్యపరమైన అంశాల పట్ల బద్ధకాన్ని తొలిగించే హెలికాఫ్టర్ రోబోను ఆస్ట్రేలియా నిపుణుల బృందం తయారు చేసింది.

రాయల్ మెల్‌బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధక బృందం రూపొందించిన ఈ రోబో హెలికాఫ్టర్, జాగింగ్‌కు వెళ్లటానికి బోర్ ఫీలయ్యేవారికి తోడుగా నిలిచి వారిలో ఉత్సాహాన్ని పెడుతుంది. ‘జాగోబోట్’గా నామకరణం కాబడిన ఈ సాంకేతిక యంత్రం మీరు పరుగెత్తుతుంటే మీ ముందు గాలిలో ఎగురుతూ సవాల్ విసురుతుంది. మీ పరుగు వేగానికి అనుగుణంగా హెలికాఫ్టర్ తన వేగాన్ని పెంచటం లేదా తగ్గిస్తుంది. ఎప్పుడూ మీకు కొన్ని అడుగుల దూరంలోనే ఉంటూ మీ ముందు ఎగురుతుంది. ఒక వేళ మీరు చెట్ల మధ్యలో ఇరుక్కుని కనిపించకపోతే కొద్ది సేపు వేచి చూసి నిదానంగా కిందకు దిగిపోతుంది.

స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌తో ఈ రోబోను రెండు రకాలుగా నియంత్రించవచ్చు. మీతోపాటు సమాన వేగంతో ఎగిరేలా లేదా మీకన్నా వేగంగా ఎగురుతూ సవాల్ విసిరేలా చేయవచ్చు. ఇంతకీ ఈ రోబో మిమ్మల్ని ఎలా గుర్తుపడుతుందో తెలుసా.. టీ షర్టుపై ఉండే నీలి, నారింజ రంగుల పట్టీని రోబోలోని కెమెరా నిరంతరం గమనిస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot