గూగుల్‌ను మళ్ళి వెంటాడుతున్న జోకర్ 'వైరస్'!! ఈ 8 యాప్ లను వెంటనే తొలగించండి...

|

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ కి ప్రపంచం మొత్తం మీద మంచి పేరు ఉంది. అలాగే దీనిని అధిక మంది కూడా వినియోగిస్తున్నారు. అయితే హ్యాకర్లు మరియు వైరస్లు కూడా ఎక్కువగా గూగుల్ నే టార్గెట్ చేసుకున్నారు. జోకర్ 'వైరస్' గురించి ప్రత్యేకంగా తెలపవలసిన అవసరం లేదు. గూగుల్ ని ఒకప్పుడు అతలాకుతలం చేసిన ఈ వైరస్ ఇప్పుడు గూగుల్ లో మళ్ళి తిరిగి వచ్చాయి. ఈ విషయాన్ని క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్‌లోని పరిశోధకులు కనుగొన్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో జోకర్ మాల్వేర్-లేస్డ్ తో కూడిన 8 యాప్‌ల కొత్త బ్యాచ్‌ను కనుగొన్నారు.

 

గూగుల్‌ను మళ్ళి వెంటాడుతున్న జోకర్ 'వైరస్'!! ఈ 8 యాప్ లను తొలగించండి..

నిరంతరం ఆండ్రాయిడ్ పరికరాలను లక్ష్యంగా చేసుకుని వినియోగదారుల డేటాను దొంగిలించే మాల్వేర్లలో జోకర్ వైరస్ కూడా ఒకటి. ప్రతి కొన్ని నెలలకు యూజర్ల డేటాను దొంగిలించే మాల్వేర్ దాని కోడ్, అమలు పద్ధతులు లేదా పేలోడ్-తిరిగి పొందే పద్ధతులను మార్చడం ద్వారా గూగుల్ యొక్క అధికారిక యాప్ స్టోర్ లోకి తిరిగి ప్రవేశించగలుగుతున్నది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం జోకర్ SMS, కాంటాక్ట్ జాబితా, డివైస్ ఇన్ఫర్మేషన్, OTP లు వంటి మరెన్నో వినియోగదారుల యొక్క డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నది.

గూగుల్‌ను మళ్ళి వెంటాడుతున్న జోకర్ 'వైరస్'!! ఈ 8 యాప్ లను తొలగించండి..

గూగుల్ సంస్థ ఇప్పుడు ఈ యాప్లను తన యొక్క ప్లే స్టోర్ నుండి తీసివేసింది. కాని అవి పూర్తిగా తొలగించబడే వరకు అవి వినియోగదారుల ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కొనసాగుతు ఉంటాయి కావున మీరు కింద తెలిపే 8 యాప్ లను తొలగించకుండా మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడుతూ ఉంటే కనుక వెంటనే తొలగించండి. మీరు తొలగించవలసిన 8 యాప్ ల పేర్లను కింద ఉన్నాయి పరిశీలించండి.

గూగుల్ స్టోర్ లో జోకర్ వైరస్ కలిగిన యాప్ లు

గూగుల్‌ను మళ్ళి వెంటాడుతున్న జోకర్ 'వైరస్'!! ఈ 8 యాప్ లను తొలగించండి..

1. ఆక్సిలియారీ మెసేజ్

2. ఫాస్ట్ మ్యాజిక్ SMS

3. ఫ్రీ కామ్‌స్కానర్

4. సూపర్ మెసేజ్

5. ఎలిమెంట్ స్కానర్

6. గో మెసేజెస్

7. ట్రావెల్ వాల్‌పేపర్స్

8. సూపర్ SMS

Most Read Articles
Best Mobiles in India

English summary
Joker 'virus' Haunting Google Again !! Remove These 8 Apps Immediately

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X