Just In
- 8 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 10 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 13 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 15 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
మోటరోలా ప్రయాణం సాగిందిలా...
అది ఏప్రిల్ 3, 1973.. మోటరోలా ఇంజనీర్ మార్టీ కూపర్ సెల్‌ఫోన్ నుంచి మొట్టమొదటి పబ్లిక్ కాల్ చేసారు. ఆ కాల్ రైవల్ రిసెర్చ్ డిపార్ట్‌మెంట్ బెల్ ల్యాబ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జోయెల్ ఎంగెల్‌కు అందింది. అప్పుడు కూపర్ ఈ విధంగా స్పందించారు ‘జోయెల్, దిస్ ఈజీ మార్టీ, ఐయామ్ కాలింగ్ యూ ఫ్రం ఏ సెల్‌ఫోన్, ఏ రియల్ హ్యాండిల్డ్ పోర్టబుల్ సెల్‌ఫోన్' అంటూ సంభాషణలు సాగాయి. ప్రపంచపు మొట్టమొదటి సెల్‌ఫోన్‌గా ‘మోటరోలా డైనాటాక్ 8000 ఎక్స్' (Motorola DynaTAC 8000x) చరిత్రకెక్కింది.
ప్రపంచానికి మొబైల్ ఫోన్‌ను పరిచయం చేసి సరికొత్త విప్లవానికి నాందిపలికిన మోటరోలా ఆ తరువాత తన ప్రాముఖ్యతను కోల్పొయింది. 2012లో మోటరోలా మొబిలిటీ విభాగాన్ని సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ $12.5బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది. తాజాగా, తమ మోటరోలా మొబిలిటీ హ్యాండ్‌సెట్ విభాగాన్ని చైనాకు చెందిన ప్రముఖకంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవోకు $2.91బిలియన్‌లకు విక్రయించినట్లు గూగుల్ తెలిపింది. ఈ నేపధ్యంలో మోటరోలా మొబైల్ ఫోన్‌ల ప్రస్థానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మోటరోలా ప్రయాణం సాగిందిలా...
ప్రపంచపు మొట్టమొదటి కమర్షియల్ పోర్టబుల్ సెల్యులార్ ఫోన్‌గా మోటరోలా డైనాటాక్ ఫోన్ (Motorola DynaTAC phone) చరిత్రపుటల్లో నిలిచింది. ఈ ఫోన్ రూపకల్పనలో భాగంగా మోటరోలా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ మేనేజర్ రూడీ క్రోలోప్ కీలక పాత్ర పోషించారు.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
సెల్యులార్ ఉత్పత్తులను ప్రవేశపెట్టిన తొలి బ్రాండ్‌గా మోటరోలా చరిత్రలో నిలిచింది. మోటరోలా డైనాటాక్ సిరీస్ నుంచి విడుదలైన 2000, 4000, 6000 ఫ్యామిలీ, 8000 ఫ్యామిలీ ఫోన్ మోడల్స్ అప్పట్లో చరిత్ర సృష్టించాయి.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
349 గ్రాములు బరువు గల మైక్రోటాక్ వ్యక్తిగత సెల్యులార్ ఫోన్‌ను మోటరోలా 1989లో పరిచయం చేసింది. అప్పట్లో ఈ ఫ్లిప్‌ఫోన్ చిన్నదిగా ఇంకా తక్కువ బరవు కలిగినదిగా ఉండేది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
మోటరోలా నుంచి విడుదలైన మరో మోడల్ మైక్రోటాక్ అల్ట్రాలైట్ క్లాసిక్‌గోల్డ్ ఎడిషన్ ఫ్లిప్‌ఫోన్, WWII నాటి హ్యాండీ-టాకీ మోడల్ SCR536 పోర్టబుల్ టూ-వే రేడియోను కలిగి ఉండేది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
1994లో మోటరోలా iDEN డిజిటల్ రేడియోను పరిచయం చేసింది. ఈ డివైజ్ ప్రపంచపు మొట్టమొదటి కమర్షియనల్ డిజిటల్ రేడియో సిస్టంగా గుర్తింపు పొందింది. 1994లో ప్రపంచ సెల్‌ఫోన్ మార్కెట్‌ను మోటరోలా శాసించింది. గార్టనర్ వెల్లడించిన వివరాల మేరకు మోటరోలా ఆ సంవత్సరంలో 32.5 మార్కెట్ వాటాను సాధించింది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
1996లో మోటరోలా కంప్యూటర్ మోడెమ్‌లకు కనెక్ట్ చేసుకోదగిన స్టార్‌టాక్ వేరబుల్ సెల్యులార్ ఫోన్‌లను ఆవిష్కరించింది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
మోటరోలా, టైమ్‌పోర్ట్ మోడల్ ఎల్7089 ట్రైబ్యాండ్ డిజిటల్ వైర్‌లెస్ ఫోన్‌ను 1999లో విడుదల చేసారు. ఈ ఫోన్‌ను జీఎస్ఎమ్ ప్రసార ప్రామాణికంలో వినియోగించారు.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
మోటరోలా వీ సిరీస్ నుంచి నాలుగు డిజిటల్ వీ8160 సెల్యులార్ టెలీఫోన్‌లు విడుదలయ్యాయి.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
జూన్ 2000లో మోటరోలా, సిస్కో కంపెనీలు సంయుక్తంగా జీపీఆర్ఎస్ సెల్యులార్ నెట్‌వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ సర్వీసును మొట్టమొదటి జీపీఆర్ఎస్ సెల్యులార్ ఫోన్ మోటరోలా టైమ్‌పోర్ట్ పీ7389ఐ మోడల్ సెల్యులార్ ఫోన్‌లో వినియోగించారు.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
ఇంటర్నెట్ ఇంకా సంక్షిప్త సందేశాలను పంపుకునేందకు వీలుగా మోటరోలా కంపెనీ 2001లో మోటరోలా వీ60 డిజిటల్ ఫోన్‌ను పరిచయం చేసింది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
మోటరోలా మొట్టమొదటి 3జీ సెల్యులార్ ఫోన్ ఏ830ను 2002లో పరిచయం చేసారు.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
2004లో మోటరోలా మోటోరాజర్ వీ3 పేరుతో అత్యంత పలచని ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయింది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
2005లో మోటరోలా గుండ్రటి అంచులతో కూడిన మోటరోలా PEBL ఫోన్‌లు మార్కెట్లో విడుదలయ్యాయి.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
జూన్ 2006లో మోటరోలా ‘మోటో క్యూ' పేరుతో పలుచటి క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌ను విడుదల చేసింది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
మింగ్ టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా 2006లో ఆసియా మార్కెట్లో విడుదల చేసింది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
మోటరోలా రాజర్2 2006లో విడుదలైంది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే మొట్టమొదటి ‘మోటరోలా డ్రాయిడ్' ఫోన్‌ను మోటరోలా కంపెనీ 2009 అక్టోబర్‌లో విడుదల చేసింది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
మోటరోలా తన మొట్టమొదటి డ్యుయల్ కోర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘మోటరోలా ఆట్రిక్స్'ను 2011లో విడుదల చేసింది. ఈ సంవత్సరంలోనే మోటరోలా ఇంక్ రెండు భాగాలుగా చీలింది. మోటరోలా సొల్యూషన్స్, మోటరోలా మొబిలిటీ.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
2012లో మోటరోలా మొబిలిటీ విభాగాన్ని $12.5 బిలియన్లకు కొనుగోలు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అదేరోజున మోటరోలా డెఫీటఫ్ ఫోన్ను ఆవిష్కరించింది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
ఆ తురవాత మోటరోలా కొత్త వర్షన్ రాజర్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిని విస్తరించుకునే క్రమంలో మోటోలక్సీ, మోటరోలా డెఫీ వేరియంట్‌లలో రెండు ఆండ్రాయిడ్ 2.3 స్మార్ట్‌ఫోన్‌లను మోటరోలా పరిచయం చేసింది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
మోటరోలా ‘డెఫీ ప్రో' పేరుతో పూర్తిస్థాయి క్వర్టీ కీప్యాడ్ ఇంకా టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేతో కూడిన మొదటి లైఫ్‌ప్రూఫ్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
సెప్టంబర్ 6, 2012న వెరిజోన్ వైర్‌లెస్ ఇంకా మోటరోలా మొబిలిటీలు సంయుక్తంగా మూడు స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. వాటి పేర్లు డ్రాయిడ్ రాజర్ ఎమ్, డ్రాయిడ్ రాజర్ హెచ్‌డి, డ్రాయిడ్ రాజర్ మాక్స్ హైడెఫినిషన్. ఈ మోడల్స్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
సెప్టంబర్ 18, 2012న మోటరోలా ప్రాసెసింగ్ చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్‌తో జతకట్టి మోటరోలా రాజర్ ఐ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
ఆగష్టు 2013లో మోటో ఎక్స్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా విడుదల చేసింది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
‘మోటో జీ' పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా నవంబర్ 2013లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి నాటికి ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం ఉంది.

మోటరోలా ప్రయాణం సాగిందిలా..
గూగుల్ తన మోటరోలా స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని లెనోవో కంపెనీకి $2.9 బిలియన్లకు విక్రయించినట్లు పేర్కొంది. లెనోవో యాజమాన్యంలో మోటరోలా ఏ మేరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాలి మరి
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470