ఐఫోన్ హ్యాక్ కోసం కోర్టు ఆదేశాలు: సారీ అంటున్న టిమ్ కుక్

Written By:

ఆపిల్ ఫోన్ హ్యాక్ చేయండి..దేశ భద్రత కన్నా డిజిటల్ ప్రైవసీకే ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు. ముందు విచారణ అధికారులకు సహకరించండి..ఇది ఆపిల్ కంపెనీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు...దీంతో ఆపిల్ కంపెనీ ఒక్కసారిగా షాక్ కు గురయింది. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంది. వినియోగదారుల భద్రత కోసం మేము ఆ పని చేయలేమని తెగేసి చెప్పింది.దీంతో కోర్టు ఆదేశాలను ఆపిల్ సంస్థ ధిక్కరించినట్లయింది. ఆసక్తిగొలుపుతున్న కథనం స్లైడర్‌లో..

Read more: అమెరికా నుంచి హైదరాబాద్‌కు ఆపిల్ కంపెనీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కాల్పులకు తెగబడిన ఘటనలో

గత సంవత్సరం క్యాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో లో సయీద్ రిజ్వాన్ ఫారుఖ్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడిన ఘటనలో 14 మంది మృతిచెందారు. 

మొబైల్ ఫోన్ ను అన్ లాక్ చేయాలని

అయితే, సయిద్ రిజ్వాన్ ఫారుఖ్ కు సంబంధించిన మొబైల్ ఫోన్ ను అన్ లాక్ చేయాలని.. తద్వారా అతని మొబైల్ లో ఉన్న సమాచారాన్ని తెలుసుకొని ఈ కేసుకు సహకరించాలని ఎఫ్ బీఐ ఆపిల్ సంస్థను కోరింది.

ఎఫ్‌బీఐ దర్యాప్తు అధికారులకు సహకరించాలని

ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి ఎఫ్‌బీఐ దర్యాప్తు అధికారులకు సహకరించాలని అమెరికాలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆపిల్ సీఈఓ దీనిపై స్పందించారు.

యూఎస్‌ ప్రభుత్వం ఓ అసాధారణమైన పని చేసి

యూఎస్‌ ప్రభుత్వం ఓ అసాధారణమైన పని చేసి ఎఫ్‌బీఐకి సహకరించాలని కోరుతోంది. దీనివల్ల మా కస్టమర్ల భద్రత చిక్కుల్లో పడుతుంది. దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామ'ని చెప్పారు.

ఇది భద్రతకు సంబంధించిన విషయం

ఇది భద్రతకు సంబంధించిన విషయం అని, మొబైల్ ఫోన్ ను తాము అన్ లాక్ చేస్తే.. అది తమ వినియోగదారుల భద్రత చిక్కుల్లో పడుతుందని ఆ సంస్థ సిఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు.

2014లో వచ్చిన ఆపిల్ మొబైల్ లో

అంతే కాకుండా 2014లో వచ్చిన ఆపిల్ మొబైల్ లో అడ్వాన్సు టెక్నాలజీ వాడామని, అందులో డిఫాల్ట్ ఆటో ఎన్ క్రిప్షన్ ఆన్ చేసి ఉంటే సమాచారాన్ని నేరుగా భద్రపరుచుకోవచ్చని.. భద్రపరుచుకున్న సమాచారం గురించి తెలుసుకోవాలి అనుకుంటే.. ఖచ్చితంగా కోడ్ తెలిసుండాలని ఆపిల్ సంస్థ చెప్తున్నది.

ఒకవేళ కోడ్ ను కనుక 10సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే

ఒకవేళ కోడ్ ను కనుక 10సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే.. సమాచారం మొత్తం డిలీట్ అవుతుందని.. ఇక దానిని తెరవడం తమ తెచ్నికల్ సిబ్బందికి కూడా సాధ్యం కాదని ఆపిల్ సంస్థ చెప్తున్నది.

ఫారుఖ్ ఫోన్ లో ఎన్నిసార్లు తప్పు కోడ్ ఎంట్రీ చేసినా

ఫారుఖ్ ఫోన్ లో ఎన్నిసార్లు తప్పు కోడ్ ఎంట్రీ చేసినా సమాచారం పోకుండా ఉండే విధంగా చేయాలని ఆపిల్ సంస్థను ఎఫ్ బీఐ కోరింది. ఇది అసాధారణమైన పని అని ఆపిల్ చెప్తున్నది.

దానిని తెరిచేందుకు వెయ్యి కాంబినేషన్లను వాడాలని

ఒకవేళ ఫరుఖ్ నాలుగు అంకెల కోడ్ ను కనుక ఉపయోగించిఉంటే, దానిని తెరిచేందుకు వెయ్యి కాంబినేషన్లను వాడాలని అంటున్నది ఆపిల్. 

ఎఫ్ బీఐ కోరినట్టు ఆపిల్ సంస్థ

మరి ఎఫ్ బీఐ కోరినట్టు ఆపిల్ సంస్థ ఫారుఖ్ మొబైల్ లోని సమాచారాన్ని తెలుసుకునేందుకు సహకరిస్తుందా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Judge orders Apple to hack into iPhone owned by San Bernardino killer
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot