‘జురాసిక్ పార్క్- 4’విడుదల తేది ఖరారు!

Posted By: Super

‘జురాసిక్ పార్క్- 4’విడుదల తేది ఖరారు!

 

జురాసిక్ పార్క్ సినిమా గురించి మీకు తెలిసే ఉంటుంది. 1993 సంవత్సరం ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓ గ్రాఫికల్ సంచలనంగా మిగిలిపోయింది. ‘జురాసిక్ పార్క్’ కోసం హాలీవుడ్ సినీ బ్రహ్మ స్టీఫెన్ స్పీల్‌బర్గ్ సృష్టించిన డైనోసార్లు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేశాయి. ఈ చిత్రాన్ని నేటికీ ఇష్టపడి చూసేవాళ్లు ఉన్నారు. అనంతరం స్పీల్‌బర్గే పార్ట్ -2ని కూడా తీశారు. ఆ చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఈ రెండు భాగాలకు కొనసాగింపుగా ‘జురాసిక్ పార్క్-3’ని కూడా తెరకెక్కించారు.

ఈ చిత్రానికి స్పీల్‌బర్గ్ కేవలం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మాత్రమే వ్యవహరించారు. జో జాన్సన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. తాజాగా ‘జురాసిక్ పార్క్ 4’ని రూపొందించడానికి స్పీల్‌బర్గ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రిక్ జఫ్పా, అమాందా సిల్వర్‌లు కధను సమకూర్చినట్లు తెలుస్తోంది.

ఈ భారీ చిత్రాన్ని జూన్ 13, 2014న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనివర్సల్ సంస్థ ఓ అధికారిక ప్రకటనను వెలువరించింది. ‘జురాసిక్ పార్క్ 1’ 915 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, పార్ట్ 2 619 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. పార్ట్ 3 మాత్రం ఈ స్థాయి వసూళ్లను కురిపించలేకపోయింది. కేవలం 369 మిలియన్ డాలర్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (టాప్-25)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot