శాంసంగ్‌కు ఎదురుదెబ్బ,ఆపిల్‌కు రూ.3600 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశం

|

దక్షిణకొరియాకు చెందిన దిగ్గజ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏడేళ్ల నాటి ఆపిల్‌ డిజైన్‌ పేటెంట్‌ కేసులో అమెరికా ఫెడరల్‌ కోర్టు శామ్‌సంగ్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఐప్యాడ్ కేసులో శాంసంగ్‌పై ఆపిల్‌ విజయం సాధించింది. ప్రతిష్మాత్మకమైన తమ ప్రొడక్ట్‌ ఐఫోన్‌లను శాంసంగ్ కాపీ కొడుతోందన్న ఆరోపణలపై ఫెడరల్‌ కోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఐఫోన్‌ డిజైన్‌ను కాపీ చేసినందుకు గానూ శాంసంగ్‌.. యాపిల్‌కు 533 మిలియన్‌ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.3,600కోట్లు) చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు రెండు పేటెంట్ల ఉల్లంఘనలకు గానూ మరో 5 మిలియన్ డాలర్లు అదనంగా చెల్లించాలని ఆదేశించింది.

 

షియోమి యూజర్లకు లక్ష రూపాయల ఉచిత లోన్,ఎలా పొందాలో తెలుసుకోండి ?షియోమి యూజర్లకు లక్ష రూపాయల ఉచిత లోన్,ఎలా పొందాలో తెలుసుకోండి ?

ఐఫోన్ డిజైన్‌ను కాపీ కొట్టిందంటూ..

ఐఫోన్ డిజైన్‌ను కాపీ కొట్టిందంటూ..

శాంసంగ్‌ తమ ఐఫోన్ డిజైన్‌ను కాపీ కొట్టిందంటూ ఆపిల్ కంపెనీ 2011లో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.గుండ్రటి ఎడ్జ్‌లతో ఉండే ఐఫోన్‌ బ్లాక్‌ స్క్రీన్‌, బీజెల్‌, గ్రిడ్‌ ఐకాన్లను శాంసంగ్‌ కాపీ కొట్టిందని ఆపిల్‌ ఆరోపించింది.

ప్రొడక్టు డిజైనింగ్ సహా ..

ప్రొడక్టు డిజైనింగ్ సహా ..

దీన్ని పేటెంట్, ట్రేడ్‌మార్క్ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ప్రొడక్టు డిజైనింగ్ సహా ప్యాకేజింగ్, యూజర్ ఇంటర్‌ఫేస్ తదితర అంశాల్లో శాంసంగ్‌ కాపీకొడుతోందని ఆపిల్ ఆరోపించింది.

నష్టపరిహారాన్ని..

నష్టపరిహారాన్ని..

ఇందుకు గానూ శాంసంగ్‌ నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేసింది. తమ డిజైన్‌ ద్వారా శాంసంగ్‌ కంపెనీకి లాభం వచ్చింది గనుక ఆ లాభాల్లో 1 బిలియన్ డాలర్లను ఆపిల్‌కు ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరింది.

శాంసంగ్‌కు వచ్చిన లాభం
 

శాంసంగ్‌కు వచ్చిన లాభం

తాజాగా శాన్‌జోస్‌లోని ఫెడరల్‌ కోర్టు దీనిపై తీర్పు వెల్లడించింది. ఆపిల్‌ డిజైన్‌ను కాపీ కొట్టడం ద్వారా శాంసంగ్‌కు వచ్చిన లాభం ఎంత అనేదాన్ని కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ తర్వాత శామ్‌సంగ్‌ 533 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది.

కీలక విజయం

కీలక విజయం

దీంతో శామ్‌సంగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆపిల్‌కు అతి ముఖ్యమైన ఐఫోన్‌ డిజైనింగ్‌ పేటెంట్‌ పోరులో ఆ కంపెనీకి ఇది కీలక విజయమని టెక్‌ నిపుణుల అంచనా వేస్తున్నారు.

Best Mobiles in India

English summary
News Jury orders Samsung to pay Apple $533 million in iPhone case More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X