ఇండియాలో ఇంటర్నెట్ వాడుతున్నపెద్దలపై సర్వే చెప్పిన నిజాలు
భారతదేశం ప్రభుత్వం ఇండియాని 'డిజిటల్ భారతదేశం' గా మార్చాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే.
భారతదేశం ప్రభుత్వం ఇండియాని 'డిజిటల్ భారతదేశం' గా మార్చాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో వెనక పడిన అనేక గ్రామాల్లో ప్రజలు ఇంటర్నెట్ వినియోగించుకునేలా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తోంది. అయితే ఇది అంత పెద్దగా ప్రభావం చూపించడ లేదని సర్వేలు చెబుతున్నాయి. లేటెస్ట్ గా ప్యూ రీసెర్చ్ సెంటర్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం మన దేశంలో ఉన్న పెద్దలు(వయసు పై బడిన వారు) ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రం ఇంటర్నెట్ వినియోగిస్తున్నారనే నిజాలు బయటకు వచ్చాయి.

సౌత్ కొరియా నెంబర్ 1:
ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకంలో దక్షిణ కొరియా అత్యధికంగా కనెక్ట్ అయిన దేశంగా నిలిచింది. ఆ దేశంలో 96 శాతం మంది స్మార్ట్ ఫోన్,ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా వాడుతున్నట్లు సర్వే తెలిపింది.

పరిస్థితులు ఇందుకు భిన్నం
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నప్పటికీ, sub-Saharan Africa మరియు భారత దేశంలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.

స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారు :
భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వాడేవారి సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ పెద్దవారిలో మాత్రం ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. స్మార్ట్ ఫోన్ వాడుతున్న పెద్దల సంఖ్య 2013 లో 12 శాతం ఉంటే అది 2017లో 22 శాతానికి పెరిగింది ఇంకా 78 శాతం పెద్దవాళ్ళు స్మార్ట్ ఫోన్ వాడేందుకు ఆసక్తి చూపడం లేదని సర్వే తెలిపింది.

ఇతర దేశాలలో :
ప్రముఖ దేశాలైన ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, స్వీడన్, కెనడా, యుఎస్, ఇజ్రాయెల్, UK, జర్మనీ, ఫ్రాన్స్ మరియు స్పెయిన్లో సుమారు ప్రతి పది మందిలో తొమ్మిది మంది స్మార్ట్ ఫోన్ ,ఇంటర్నెట్ మరియు సోషల్ నెట్వర్కింగ్ వాడ్తున్నట్టు సర్వే ద్వారా తెలిసింది.

సోషల్ మీడియా:
భారతదేశంలో సోషల్ మీడియా వాడుతున్న వారి సంఖ్య 2013 నుంచి 2017తో పోలిస్తే 20 శాతం వరకు పెరిగింది. ఈ సంఖ్య చాలా తక్కువ. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే ఎక్కువ శాతం మంది పెద్దలకు సోషల్ మీడియా ఫై ఎటువంటి అవగాహన ఉండటం లేదని సర్వే వెల్లడించింది.

సర్వే రిపోర్ట్స్ :
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య గత ఐదు సంవత్సరాల నుంచి ఇంటర్నెట్ వినియోగంలో స్థిరమైన పెరుగుదల కనిపించిదని ఈ విషయాన్ని 19 సర్వేలు కూడా తెలిపాయని Pew Research Center తెలిపింది.
- 2013లో, భారతదేశంలో 16 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ ను ఉపయోగించారని నివేదించింది. భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న ప్రజల సంఖ్య 2017 నాటికి 25 శాతానికి పెరిగింది.
- 2013 మరియు 2014 మధ్య, అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో 42 శాతం మధ్య వయస్కులు వారు ఇంటర్నెట్ను కనీసం అప్పుడప్పుడూ యాక్సెస్ చేశారని,సర్వే చేయబడింది.
- 2015-16లో, వృద్ధి చెందుతున్న దేశాల్లో సుమారు పదిమంది పెద్దలు సర్వే చేయబడ్డారు, వారు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను ఉపయోగించారని చెప్పారు.
- 2017 నాటికి, 53 శాతం మంది సోషల్ మీడియా వాడతారు. అదే కాలంలో సోషల్ మీడియా వాడకం చాలా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో సర్వే చేయబడింది.


Click it and Unblock the Notifications