అత్యంత తక్కువ ధరకే 55 అంగుళాల స్మార్ట్‌టీవీ, జేవీసీ సంచలనం
మనదేశంలో అనేక రకాల కంపెనీల టీవీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భారతీయ టీవీ మార్కెట్‌లో చవక ధరల్లో స్మార్ట్‌టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. చైనా దిగ్గజం షియోమి టీసీఎల్, ఇఫ్ల్కాన్, వియు
మనదేశంలో అనేక రకాల కంపెనీల టీవీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భారతీయ టీవీ మార్కెట్‌లో చవక ధరల్లో స్మార్ట్‌టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. చైనా దిగ్గజం షియోమి టీసీఎల్, ఇఫ్ల్కాన్, వియు, శాంసంగ్ వంటి సంస్థలు అదిరే ఫీచర్లతో అత్యంత తక్కువ ధరల్లో స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే జపాన్‌కు చెందిన కంపెనీ జేవీసీ చవక ధరలో మరో సరికొత్త టీవీని లాంచ్ చేసింది. స్థానిక ఓఈఎం వైరా గ్రూప్ ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టిన తన కొత్త తరం టీవీలు అత్యంత తక్కువ ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

ధర
55 అంగుళాల అల్ర్టా హెచ్‌డీ ఇంటిలిజెంట్ స్మార్ట్‌టీవీని జపాన్‌కు చెందిన కంపెనీ జేవీసీ కంపెనీ ఇండియాలో విడుదల చేసింది. 55ఎన్ 7105 సీ జపాన్‌కు చెందిన కంపెనీ జేవీసీ ధరను కంపెనీ రూ. 38,999గా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ టీవీలు ఈ కామర్స్ పోర్టల్ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో 39,999కి అందుబాటులో ఉంది.

ఫీచర్లు
3840x2160 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ , ఫ్రెష్ రేట్ 60హెచ్‌జడ్, ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్, 50వాట్స్ సౌండ్ అవుట్ పుట్, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, అమోలాజిక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్క్వాడ్-కోర్ ప్రాసెసర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.క్వార్టీ కీబోర్డు
అలాగే సాధారణ రిమోట్‌తోపాటు క్వార్టీ కీబోర్డుతో రూపొందించిన మరో స్మార్ట్‌రిమోట్‌ను అందిస్తోంది. ఒక సంవత్సరం వారంటీతో ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌టీవీ లభ్యం కానుంది.
రెండు ఇంటర్ఫెసెస్
స్మార్ట్ కనెక్టివిటీ కోసం ఈ టీవీకి రెండు ఇంటర్ఫెసెస్ ఉన్నాయి. సీయూఐ, సెన్సీవాల్ తోపాటు.. హాట్‌స్టార్, యూట్యూబ్, నెట్‌ఫ్లెక్స్ లాంటి యాప్‌లు ముందే ఇన్‌స్టాల్ చేసి వున్నాయి. ఇక హార్డ్‌వేర్ కనెక్టివిటీ కోసం JVC 55N7105C మూడు HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ కలిగివున్నాయి. HDR సపోర్ట్ కూడా ఇందులో జతచేయడం జరిగింది.

వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ
వైర్ తోపాటు వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ చేసుకునే వీలుంది. ఇక యాప్ స్టోర్‌లో ఉన్న 500 వరకు యాప్స్‌లో వినియోగదారుడు నచ్చినవి ఎంచుకోవచ్చు. అంతేగాకుండా ఈ టీవీకి రెండు రిమోట్లు వస్తున్నాయి. ఒకటి స్టాండర్డ్‌ది కాగా, మరోటి క్వార్టీ కీబోర్డ్ కలిగి ఉన్నది.

ప్రారంభ ధర రూ.16,999
ఈ కంపెనీ ఇండియాలో ఇప్పటికే సరసమైన ధరల్లో టీవీలను ప్రవేశపెట్టింది. వీటి ప్రారంభ ధర రూ.16,999 గా ఉన్నాయి. ఇక కొత్తగా వచ్చిన 55N7105C టీవీ ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ రేంజీలోనే ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications