టార్గెట్ ఆ ముగ్గురే..?

ఎంట్రీస్థాయి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తమదైన శైలిలో దూసుకుపోతున్న సామ్‌సంగ్, ఎల్‌జీ, హెచ్‌టీసీ బ్రాండ్‌లను అడ్డుకునేందుకు కార్చన్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఈ బ్రాండ్ ఇటీవల కాలంలో రెండు స్మార్ట్‌పోన్‌లను ప్రకటించింది. కార్బన్ ఏ7,ఏ9 మోడళ్లలో రూపుదిద్దుకుంటున్న ఈ ఎంట్రీ స్థాయి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు ఉత్తమమైన స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉండటంతో మార్కెట్ అంచనాలు జోరందుకున్నాయి. వీటి విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే, కార్బన్ ఏ9 హ్యాండ్‌సెట్లను పలు ఆన్‌లైన్ రిటైలర్ సంస్థలు రూ.9,000 ధరకు ఆఫర్ చేస్తుండటం విశేషం.
కార్బన్ ఏ9 కీలక ఫీచర్లు:
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెడ్జ్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్,
5 మెగాపిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
హై క్వాలిటీ మల్టీమీడియా పీచర్,
మన్నికైన బ్యాటరీ బ్యాకప్.
భారత విపణిలో కార్బన్ కెటీ81:
మధ్యతరగతి మొబైల్ బ్రాండ్ కార్బన్ ఉపయుక్తమైన ఫీచర్లతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కార్బన్ కెటీ81ను భారత విపణిలో లాంచ్ చేసింది. యువతను ఉర్రూతలూగించే డాల్బీ సౌండ్ వ్యవస్థతను ఈ గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేశారు. మ్యూజిక్ ప్రియులకు ఈ హ్యాండ్‌సెట్ మరింత నచ్చుతుంది. నిక్షిప్తం చేసిన డాల్బీ సౌండ్ సిస్టం, క్వాలిటీ ఆడియో ప్లేయర్ ఇంకా ఎఫ్ఎమ్ రేడియో వ్యవస్థలు నాన్‌స్టాప్ వినోదాలను చేరువ చేస్తాయి. మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను వినియోగదారు ఆశించవచ్చు. డివైజ్ వెనుక భాగంలో అమర్చిన 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఉత్తమమైన ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. కార్బన్ మరియు డాల్బీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో డిజైన్ కాబడిన ఈ ఫోన్ మార్కెట్ అంచనా రూ. 5,000. విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే…
- 3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, - రిసల్యూషన్ 2048х1536పిక్సల్స్ - ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం, - 3 మెగా పిక్సల్ కెమెరా (డిజిటల్ జూమ్ సౌలభ్యత), - వీడియో రికార్డింగ్ సౌకర్యం, - ఫోన్‌బుక్ సామర్ధ్యం (2000 ఎంట్రీల వరకు), - ఎక్సటర్నల్ స్టోరేజ్ 16జీబివరకు, - ఎడ్జ్ కనెక్టువిటీ, - వై-ఫై, - బ్లూటూత్, - యూఎస్బీ కనెక్టువిటీ, - జీపీఎస్ ఫెసిలిటీ, - హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్, - నెట్‌వర్క్ సపోర్ట్ ( 2జీ, 3జీ), - ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, - గేమ్స్, - లౌడ్ స్పీకర్, ఆడియో జాక్,
- 1000 mAh బ్యాటరీ.


Click it and Unblock the Notifications








