రూ.4890కే ‘కార్బన్ కే9 స్మార్ట్ సెల్ఫీ’

|

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌‍ఫోన్‌ల తయారీ కంపెనీ కార్బన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 'కార్బన్ కే9 స్మార్ట్ సెల్ఫీ’ పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.4,890.

 
రూ.4890కే  ‘కార్బన్ కే9 స్మార్ట్ సెల్ఫీ’

4G VoLTE కనెక్టువిటీ ఫీచర్‌తో వస్తోన్న ఈ సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లో 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. బ్లాక్ ఇంకా బ్లూ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది.

కార్బన్ కే9 స్మార్ట్ సెల్ఫీ స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల FWVGA 2.5D కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 854 x 480 పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.1GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

భారీ అంచనాలతో వన్‌ప్లస్ '5టీ'భారీ అంచనాలతో వన్‌ప్లస్ '5టీ'

ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో కూడిన 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ బ్లూటీ మోడ్ అండ్ నైట్ షూట్ మోడ్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 2300mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4G VoLTE, Wi-Fi, Bluetooth 4.0, GPS).

ఇంచుమించుగా ఇదే విధమైన ధర ట్యాగ్‌లో ఇంటెక్స్, ఐటెల్, మైక్రోమాక్స్ వంటి బ్రాండ్‌లు 4G VoLTE
ఫోన్‌లను మార్కెట్లో ఆఫర్ చేస్తోన్న విషయం తెలిసిందే.

Best Mobiles in India

Read more about:
English summary
Karbonn K9 Smart Selfie smartphone with an 8MP selfie camera and 4G VoLTE has been announced at a price point of Rs. 4,890.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X