దేశీయ కంపెనీ దూకుడు, రూ.700కే కొత్త ఫోన్

By Gizbot Bureau
|

Domestic smartphone player Karbonn ఒకేసారి 4 రకాల ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో పోటీపడుతూ పడుతూ లేస్తూ వస్తున్న దేశీ స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ కార్బన్ మొబైల్స్ కేఎక్స్3, కేఎక్స్25, కేఎక్స్26, కేఎక్స్27 అనే పేర్లతో 4 రకాల ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కార్బన్ కొత్త ఫోన్ల ధర రూ.700 నుంచి రూ.1,000 మధ్యలో ఉన్నాయి.

దేశీయ కంపెనీ దూకుడు, రూ.700కే కొత్త ఫోన్

 

కార్బన్ కేఎక్స్3 మోడల్‌లో 1.7 అంగుళాల స్క్రీన్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో, రికార్డర్, పవర్ సేవింగ్ మోడ్, వీడియో మ్యూజిక్ ప్లేయర్ వంటి ఫీచర్లున్నాయి. అయితే ఇవి ఇంకా అమ్మకానికి రాలేదు. త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

 కేఎక్స్25, కేఎక్స్26 ఫీచర్లు

కేఎక్స్25, కేఎక్స్26 ఫీచర్లు

కేఎక్స్25 ఫోన్‌లో 1,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 2.4 అంగుళాల స్క్రీన్, ఎఫ్ఎం రేడియో, డ్యూయెల్ సిమ్, ఎల్ఈడీ టార్చ్, డిజిటల్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. కార్బన్ కేఎక్స్26 ఫోన్‌లో 1.7 అంగుళాల స్క్రీన్, 1450 ఎంఏహెచ్ బ్యాటరీ, డిజిటల్ కెమెరా, వీడియో మ్యూజిక్ ప్లేయర్ వంటి ఫీచర్లు చూడొచ్చు. చివరగా కేఎక్స్27 ఫోన్‌లో 1750 ఎంఏహెచ్ బ్యాటరీ, డిజిటల్ కెమెరా, బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ మెసేజ్, బిజినెస్ కార్డ్స్ వంటి ప్రత్యేకతలున్నాయి.

కొత్త టెక్నాలజీతో ఫోన్లు

కొత్త టెక్నాలజీతో ఫోన్లు

తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో కొత్త టెక్నాలజీతో ఫోన్లు అందుబాటులోకి తీసుకువచ్చామని, కేఎక్స్ సిరీస్ ఫోన్లు ఇందుకు ఉదాహరణ అని కార్బన్ మొబైల్స్ ఎండీ ప్రదీప్ జైన్ తెలిపారు. కస్టమర్ల సంతృప్తి తమకు ముఖ్యమని పేర్కొన్నారు. భారత్‌లో గత పదేళ్ల నుంచి సేవలు అందిస్తున్నామని, రానున్న రోజుల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిస్తామని పేర్కొన్నారు.

కె9 కవచ్ 4జీ
 

కె9 కవచ్ 4జీ

గతేడాది విడుదల. దీని ధర రూ.5,290

కార్బన్ కె9 కవచ్ 4జీ ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ.

కార్బన్ టైటానియం జంబో 2

కార్బన్ టైటానియం జంబో 2

గతేడాది విడుదల. దీని ధర రూ.5,999

కార్బన్ టైటానియం జంబో 2 ఫీచర్లు

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
Karbonn launches 4 new feature phones in India, prices start at Rs 700

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X