కార్బన్ ఏ41 పేరిట కొత్త స్మార్ట్ ఫోన్ !

By: Madhavi Lagishetty

కార్బన్ ఏ41పవర్ పేరిట ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 4,099రూపాయలు. 4జి వోల్ట్ కనెక్టివిటీతో మార్కెట్లోకి విడుదలయ్యింది.

కార్బన్ ఏ41 పేరిట కొత్త స్మార్ట్ ఫోన్ !

కార్బన్ మొదటిసారిగా 4జి స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కార్బన్ ఏ41పవర్ ఎంట్రీ లెవన్ మార్కెట్ సెగ్మెంట్లో ప్రవేశపెట్టింది. బేసిక్ స్పెసిషికేషన్లు కలిగి ఉంది. అంతేకాదు దేశంలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విభాగంలో కర్బన్ ద్రుష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమధ్యే అర నోట్ ను 7500రూపాయలకు మార్కెట్లో ప్రవేశపెట్టింది.

కార్బన్ ఏ41 పవర్ , స్మార్ట్ ఫోన్ ఇతర స్మార్ట్ ఫోన్ల కంటే మంచి ఫీచర్స్ ను కలిగి ఉంది. 4అంగుళాల wvga డిస్ ప్లే, 800x 480పిక్సెల్స్ రిజల్యూషన్ తోపాటు క్వాడ్ కోర్ ప్రొసెసర్ 1.3గిగా వద్ద క్లాక్ చేయబడి ఉంది. 1జిబి ర్యామ్, 8జిబి స్టోరేజీ కెపాసిటితోపాటు మైక్రో ఎస్డి కార్డును ఉపయోగించిన 32జిబి వరకు విస్తరించబడుతుంది.

బిగ్‌సిలో నోకియా 5 ఫ్రీ బుకింగ్స్ , ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉచితం

యూజర్స్ ఆలోచనలకు అనుగుణంగా కార్బన్ ఏ41పవర్ స్పోర్ట్స్ ఒక ఎల్ఈడీ ఫ్లాష్ తో 2మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, వీజిఏ కెమెరా ఉంది. స్పెసిఫికేషన్లు పాతవి అయినప్పటికీ డివైస్ ధరను అంచనా వేయలేము. ఆండ్రాయిడ్ 7.0నౌగట్, 2300ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దాదాపు 8గంటల వరకు బ్యాటరీ నిల్వ ఉంటుంది. 4జివోల్ట్ , డ్యుయల్ సిమ్, బ్లూటూత్ ఉన్నాయి.

ఇక కార్బన్ ఏ41 పవర్ ధర 4,099రూపాయలు. ఇంటెక్స్, వూమి, ఎల్వైఎఫ్, మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ధరలు కూడా అదేవిధంగా ఉంటాయి. ఎంట్రీ స్థాయి స్మార్ట్ ఫోన్స్ యూజర్లు కూడా వారి అవసరాలకు సరిపోయేందుకు ఒక ఫోన్ ఎంచుకోవడంలో కఠినంగా కనిపిస్తుంది.

Read more about:
English summary
Karbon has announced the launch of the A41 Power, an entry-level smartphone with 4G VoLTE and Android Nougat.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot