కార్బన్ మొబైల్స్ కొత్త రిలీజ్‌ల జోరు!

Posted By: Prashanth

కార్బన్ మొబైల్స్ కొత్త రిలీజ్‌ల జోరు!

 

గ్యాడ్జెట్ సీమలో కార్బన్ మొబైల్స్ కొత్త ఆవిష్కరణల జోరు కొనసాగుతోంది. శుక్రవారం బ్రాండ్ నుంచి ‘కార్బన్ స్మార్ట్’ సిరీస్ పేరిట ఐదు సరికొత్త ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లు విడుదలయ్యాయి. వీటిలో రెండు టాబ్లెట్ పీసీలతో పాటు మూడు ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. కార్బన్ స్మార్ట్ 2 (బ్లేడ్), కార్బన్ స్మార్ట్ మార్వల్ (మార్వల్), క్వార్బన్ స్మార్ట్ ఏ11, ఏ7+, ఏ1+ మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్ గ్యాడ్జెట్‌ల స్సెసిఫికేషన్‌లు క్లుప్తంగా.....

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 3 (బ్లేడ్): ‘టాబ్లెట్ ’

7.1 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్, 3డి గ్రావిటీ సెన్సార్, శక్తివంతమైన 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వై-ఫై బి/జి/ఎన్, 3జీ సపోర్ట్, యూఎస్బీ డాంగిల్, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ప్రీలోడెడ్ అప్లికేషన్స్ (కార్బన్ స్మార్ట్‌బ్రౌజర్, కార్బన్ స్మార్ట్‌గేమ్స్, టీవోఐ&ఈటీ అప్లికేషన్స్, ఫేస్‌బుక్, ధర రూ.5,990.

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 9 (మార్వెల్): ‘టాబ్లెట్ ’

9 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్, 3డి గ్రావిటీ సెన్సార్, శక్తివంతమైన 4000ఎమ్ఏహెచ్ మారథాన్ బ్యాటరీ, వై-ఫై బి/జి/ఎన్, 3జీ సపోర్ట్, యూఎస్బీ డాంగిల్, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ప్రీలోడెడ్ అప్లికేషన్స్ (కార్బన్ స్మార్ట్‌బ్రౌజర్, కార్బన్ స్మార్ట్‌గేమ్స్, టీవోఐ&ఈటీ అప్లికేషన్స్, ఫేస్‌బుక్, ధర రూ.7,990.

కార్బన్ ఏ11: ‘స్మార్ట్ ఫోన్’

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్800x 480పిక్సల్స్), 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), ఫ్రంట్ కెమెరా, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర అంచనా రూ.9990.

కార్బన్ ఏ7+: ‘స్మార్ట్‌ఫోన్’

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, 3.5 అంగుళాల కెపాసిటివ్ డిస్‌ప్లే, 1420ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర అంచనా రూ.8990.

కార్బన్ ఏ1+: ‘స్మార్ట్‌ఫోన్’

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, 3.5 అంగుళాల కెపాసిటివ్ డిస్‌ప్లే, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర అంచనా రూ.4990.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot