లైన్ క్లియర్.. అగష్టులో ఆ క్రేజీ ప్రాజెక్ట్!

Posted By: Staff

లైన్ క్లియర్.. అగష్టులో ఆ క్రేజీ ప్రాజెక్ట్!

 

మొబైల్ తయారీ బ్రాండ్ కార్బన్ త్వరలో ప్రవేశపెట్టనున్న ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆధారిత టాబ్లెట్ పీసీ స్మార్ట్ ట్యాబ్-4 పై నెలకున్న సందిగ్థతకు తెరపడింది. కార్బన్ మొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ జెయిన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ 9.7 అంగుళాల స్ర్కీన్ సైజును కలిగి గుగూల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ జెల్లీబీన్ పై రన్ అయ్యే టాబ్లెట్ కంప్యూటర్ ‘స్మార్ట్ ట్యాబ్ -4’ ను అగష్టులో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. డివైజ్ ధరను రూ.11,000గా నిర్ణయించినట్లు సమాచారం.

కార్బన్ స్బార్ట్ ట్యాబ్-4 కీలక పీచర్లు:

9.7 అంగుళాల టచ్ స్ర్కీన్,

గొరిల్లా గ్లాస్ టెక్నాలజీ,

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,

3జీ కనెక్టువిటీ సౌలభ్యత (డాంగిల్ ద్వారా),

వై-ఫై ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ,

ధర రూ.11,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot