కరుణానిధి కొత్త అవతారం!

Posted By: Staff

కరుణానిధి కొత్త అవతారం!

ఆయా రంగాల్లో రాణిస్తున్న ప్రముఖ వ్యక్తులు తమ అభిమానులతో నిరంతర సంభాషణలను సాగించేందుకు సామాజిక నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లు ఎంతగానో తోడ్పడుతున్నాయి. తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎమ్‌కే పార్టీ అధినేత కరుణానిధి సోషల్ మీడియా సైట్‌లైన ఫేస్‌బుక్, ట్విట్టర్ సేవలను ఉపయోగించుకోనున్నారు. ప్రజలతో మరింత మమేకమయ్యేందుకు ఈ 88 ఏళ్ల రాజకీయ పండితుడు ఫేస్‌బుక్, ట్విట్టర్ ల ద్వారా ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సీనియర్ రాజకీయవేత్త సేవలకు చిహ్నంగా ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు డీఎమ్‌కే పార్టీ కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కరుణానిధి పేరుతో అధికారిక ఫేస్‌బుక్, ట్విట్టర్ ఆకౌంట్‌లు తెరవ బడ్డాయి. త్వరలో వీటి నుంచి కరుణానిధి తన సేందేశాలను పోస్ట్ చేయునున్నారు. ఈ సమాచారాన్నిపార్టీ వర్గాలు ధృవీకరించాయి.

Read In English

కరుణానిధి ఫేస్‌బుక్, ట్విట్టర్ ఆకౌంట్‌ల చిరునామా:

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting