Home
News

కాశ్మీర్‌లో ప్రభుత్వ ఉన్నతాధికారులకు శాటిలైట్ ఫోన్లు

ఒకవైపు ఉగ్రవాద ముప్పు మరియు మొరొక వైపు నియంత్రణ రేఖ విషయంలో పాకిస్తాన్‌తో శత్రుత్వం పెరగడంతో కీలక స్థావరాలు, సున్నితమైన ప్రాంతాలలో అధికారులను ఇప్పుడు ఉన్న దాని కంటే మరింత ఎక్కువ మందిని మరియు వారి అధికారాన్ని పెంచడంతో కాశ్మీరీ విషయంలో మరింత ఉదృక్తిత పెరిగింది . ఇందులో భాగంగా ప్రభుత్వ ఉన్నతాధికారులకు శాటిలైట్ ఫోన్లు మరియు క్లోజ్డ్ గ్రూప్ మొబైల్ ఫోన్లను పంపిణీ చేసింది.

kashmir tension satellite phones distributed to top government officials

వీటిని పంపిణి చేయబడినందున న్యూస్ నేషన్ యాక్సెస్ చేసిన కొన్ని అధికారిక పత్రాలు మరియు ఫోన్ కనెక్షన్లను త్వరలో తొలగించవచ్చని సూచిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను దిగజార్చిన సందర్భంలో శాంతిభద్రతల పరిస్థితిని ఎదుర్కోవటానికి సెంట్రల్, నార్త్ మరియు దక్షిణ కాశ్మీర్‌లోని భద్రతా అధికారులకు శాటిలైట్ ఫోన్లు మరియు క్లోజ్డ్ గ్రూప్ మొబైల్ ఫోన్లు పంపిణీ చేయబడ్డాయి అని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

సైనికుల మోహరింపు:

సైనికుల మోహరింపు:

గత కొన్ని వారాలుగా కేంద్రం చొరవ తీసుకుంటున్నందున జమ్మూ కాశ్మీర్‌లోని లోయ అంతటా భయాందోళనలు మరియు చాలా రకాల పుకార్లు ఉన్నాయి. ఒక వారంలోపు కాశ్మీర్ లోయలో అదనంగా 38,000 మంది సైనికులను 10,000 మరియు 28,000 అనే రెండు బ్యాచ్లలో మోహరించాలని కేంద్రం నిర్ణయించింది.

అమర్‌నాథ్ యాత్ర లక్ష్యం:

అమర్‌నాథ్ యాత్ర లక్ష్యం:

భద్రతా బెదిరింపులను చూపుతూ అమర్‌నాథ్ యాత్రికులు మరియు పర్యాటకులకు తమ బసను తగ్గించుకోవాలని జమ్మూ కాశ్మీర్ అధికారులు శుక్రవారం సలహా ఇస్తున్న నేపథ్యంలో కాశ్మీర్‌లోని ఈ ప్రాంతంలో అశాంతి మరింత తీవ్రమైంది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకోవాలని యోచిస్తున్నట్లు ఆర్మీ హెచ్చరికను అనుసరించి ఈ సలహా ఇచ్చారు.

 స్థిర నివాసితులు ఆందోళన:

స్థిర నివాసితులు ఆందోళన:

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అమర్‌నాథ్ యాత్రను రద్దు చేసి యాత్రికులు మరియు పర్యాటకులను శుక్రవారం కాశ్మీర్ లోయ నుండి బయలుదేరమని కోరిన తరువాత అక్కడ వున్న స్థిర నివాసితులు చాలా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఆత్రుతగా తమ నిత్యావసరాలను ఎక్కువగా నిల్వ చేసుకోవడానికి అన్ని రకాల మార్కెట్లకు ఎక్కువగా తరలివెళుతున్నారు. కిరాణా షాపులు మరియు పెట్రోల్ బంక్ కేంద్రాల బయట వున్న లైన్ వరుసలు పాము క్యూల వలె కనిపిస్తున్నాయి.

క్రికెటర్స్ :

క్రికెటర్స్ :

అండర్ -16 (విజయ్ మర్చంట్ ట్రోఫీ), అండర్ -19 (కూచ్ బెహార్ ట్రోఫీ) స్క్వాడ్‌ల ట్రయల్స్‌ను పర్యవేక్షించడానికి శ్రీనగర్‌లో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర జట్ల మెంటర్ భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా తమ యువ ఆటగాళ్లతో శ్రీనగర్ నుంచి బయలుదేరవలసివచ్చింది.

పారామిలిటరీ దళాలు:

పారామిలిటరీ దళాలు:

వివిధ విద్యాసంస్థలు తమ విద్యార్థులను హాస్టళ్ల నుండి ఖాళీ చేయమని ఆదేశించాయి. గత వారం జమ్మూ చేరుకున్న అదనపు పారామిలిటరీ దళాలను నగరం అంతటా మరియు కాశ్మీర్ లోయలోని ఇతర బలహీన ప్రాంతాలలో మోహరించినట్లు అధికారులు తెలిపారు. సివిల్ సెక్రటేరియట్, పోలీసు ప్రధాన కార్యాలయం, విమానాశ్రయం మరియు నగరంలోని కీలకమైన వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల చుట్టూ భద్రతా సిబ్బంది బలం పెరిగిందని వారు తెలిపారు. రాష్ట్ర వేసవి రాజధాని అయిన శ్రీనగర్‌కు ప్రవేశ మరియు నిష్క్రమణ పాయింట్లతో సహా అనేక రహదారులపై బారికేడ్లు నిర్మించబడ్డాయి. లా అండ్ ఆర్డర్ అవాంతరాల భయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అల్లర్లను నియంత్రణ చేసే వాహనాలను కూడా స్టాండ్‌బైలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

కేంద్ర హోమ్ మంత్రి:

కేంద్ర హోమ్ మంత్రి:

డీల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఉన్నత భద్రతా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చించినట్లు భావిస్తున్నారు. గంటసేపు జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోమ్ కార్యదర్శి రాజీవ్ గౌబా తో పాటూ ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

BAT దాడి:

BAT దాడి:

కేరన్ సెక్టార్‌లోని లైన్ అఫ్ కంట్రోల్ (LoC) వెంట ఫార్వర్డ్ పోస్టుపై బాట్ దాడి చేయడంతో సరిహద్దులో భారత్, పాకిస్తాన్ భద్రతా దళాల మధ్య జరిగిన తాజా ఘర్షణల మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ ఘర్షణల లో సుమారు ఐదు నుంచి ఏడుగురు చొరబాటుదారులు మరణించారు. భారత సైన్యం తమను సంప్రదించడానికి సహచరులైన పాకిస్తాన్ సైనంకు తెల్ల జెండాలు ఎత్తవలసిందిగా సుచించింది. అంతే కాకుండా తమ నియంత్రణ రేఖలో భారత వైపు పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకోవాలని కూడా కోరింది. BAT సాధారణంగా పాకిస్తాన్ సైన్యం మరియు ఉగ్రవాదుల ప్రత్యేక దళాల సిబ్బందిని కలిగి ఉంటుంది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
kashmir tension satellite phones distributed to top government officials
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X