అలెర్ట్.. మీ స్మార్ట్‌ఫోన్‌లు ఈ యాప్‌లు ఉన్నాయా.. వెంటనే డిలీట్ చేయండి..!
సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. వివిధ మార్గాల్లో మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు ఫోన్ కు వచ్చిన ఏదైనా లింక్ ను ఓపెన్ చేయాలన్నా భయం కలిగేలా పరిస్థితులు కొన్నిసార్లు ఉంటున్నాయి. అయితే అప్రమత్తంగా ఉండడం సహా అవసరం లేని లింక్స్‌ను ఒపెన్ చేయకపోవడం ద్వారా మోసాలకు గురికాకుండా ఉండగలుగుతారు. లింక్స్‌తోపాటు కొన్ని రకాల హానికర యాప్స్ ద్వారా కూడా నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్‌లలోని సున్నితమైన డేటాను చోరీ చేసేందుకు నకిలీ యాప్స్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు.
సైబర్ భద్రతా నిపుణులు సహా భద్రతా సంస్థల సూచనలతో గూగుల్.. అటువంటి యాప్స్‌పై చర్యలు తీసుకుంటోంది. మరియు వెంటనే గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగిస్తుంది. అయితే ఆపిల్ స్టోర్‌లో ఇటువంటి పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది. అయితే తాజాగా ఓ వార్త ఐఫోన్ యూజర్‌లను ఆందోళనకు గురిచేస్తుంది.

సాధారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఐఫోన్ లు సురక్షితంగా ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఆపిల్ స్టోర్‌లో కొన్ని హానికర యాప్‌లను గుర్తించినట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీ వాలెట్‌లను యాక్సెస్ చేసేందుకు వీలుగా జరుగుతున్న ప్రయత్నాన్ని కాస్పెర్క్సీ (Kaspersky) గుర్తించినట్లు తెలిపింది.
యాప్ స్టోర్‌లో ఇమేజ్ స్కానింగ్ మాల్‌వేర్ కలిగిన యాప్‌లను గుర్తించినట్లు తెలిపింది. అధికార, అనధికార మార్గాల ద్వారా ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్‌లను టార్గెట్ చేసుకుందని తెలిపింది. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి ఇప్పటికే ఈ తరహా హానికర యాప్‌లను 2,42,000 సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపింది.
అయితే ఐఫోన్ యూజర్లపై ఈ హానికర యాప్‌ల ప్రభావం ఎంత ఉందో తెలియలేదని తెలిపింది. అయితే గతంలో ఎప్పుడూ లేనట్టుగా తొలిసారి ఆపిల్ స్టోర్‌లో కనిపించాయని తెలిపింది. ఈ హానికర యాప్స్‌లో OCR ఫ్లగ్ ఇన్‌లను ఉపయోగించినట్లు తెలుస్తోంది.
వీటి ద్వారా అవసరం అయిన సమాచారం చోరీ చేసి సైబర్ నేరగాళ్లకు తిరిగి పంపేలా మాల్‌వేర్ పనిచేస్తుందని పేర్కొంది. క్రిప్టో వాలెట్ వివరాలు సహా ఫోన్ లోని ఇతర సున్నితమైన వివరాలను కూడా గుర్తిస్తుందని తెలిపింది. యాప్‌లకు సంబంధించిన వివరాలను కాస్పెర్స్కీ వెల్లడించింది.
కాస్పెర్స్కీ వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ జాబితాలో ComeCome, ChatAi, WeTink, AnyGPT ఉన్నాయి. ఈ మాల్‌వేర్ గత సంవత్సరం 2024 నుంచి ఉందని, అందువల్ల ఏయే యాప్‌లు దీని వల్ల ఎఫెక్ట్ అయ్యేయో గుర్తించడం కష్టమని తెలిపింది. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ లలో ఎక్కువ అనుమతులు లేకుండానే ఇవి పనిచేస్తాయని.. అందువల్ల గుర్తించడం కష్టమని తెలిపింది.
ఈ మాల్‌వేర్ అటాక్ ప్రధానంగా యూరప్, ఆసియాలోని ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోందని కాస్పెర్స్కీ తెలిపింది. అయితే ఇందుకు కారణాలు ఏంటనే విషయం తమకు తెలియదని వెల్లడించింది. అయితే పైన తెలిపిన యాప్ లు మీ ఫోన్ లో ఉండే వెంటనే తొలగించాల్సి ఉంటుంది. లేకుంటే మీ ఫోన్ లో సున్నితమైన డేటా చోరీ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది.
గతంలోనూ కేంద్ర ప్రభుత్వంలోని సైబర్ భద్రతా ఏజెన్సీల సూచనలతో అనేక యాప్‌లను తొలగించాలని సూచనలు వచ్చాయి. ముఖ్యంగా ఇతర దేశాల కేంద్రంగా పనిచేస్తున్న యాప్‌లతో ప్రైవసీ సమస్యలు వస్తున్నాయనే కారణాలతో కొన్ని రకాల యాప్‌లను ఫోన్‌ల నుంచి డిలీట్ చేయాలని సైబర్ నిపుణులు కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏదైనా యాప్ ను ఇన్‌స్టాల్ చేసుకొనే సమయంలోనే అప్రమత్తంగా వ్యవహరించడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








