ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటున్నారా.. క్యాన్సర్ కంటే డేంజర్.. తెలుసుకోకపోతే నేరుగా కాటికే..!!
Phone cause cancer: ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లతోనే గడుపుతున్నారు. అంతేకాదు, చాలామంది రాత్రి పడుకునేటప్పుడు ఫోన్‌ని దిండు కింద లేదా పక్కనే పెట్టుకుంటారు. ముఖ్యంగా యువతీ యువకులు ఫోన్ ఆఫ్ చేయకుండా రోజంతా వాడతారు, రాత్రి కూడా పక్కనే పెట్టుకుని నిద్రపోతారు. ఫోన్ అంత దగ్గరగా పెట్టుకుని పడుకోవడం మంచిదేనా? ఫోన్ రేడియేషన్ మన ఆరోగ్యానికి హాని చేస్తుందా? తెలుసుకుందాం.
* ఫోన్ రేడియేషన్ భయం
ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ మనకి హాని చేస్తుందని చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంటే క్యాన్సర్ వస్తుంది, పెద్ద జబ్బులు వస్తాయని సోషల్ మీడియాలో చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఫోన్లు తక్కువ శక్తి ఉన్న రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఎక్స్-రేలు లాంటి ప్రమాదకరమైన రేడియేషన్ కాదు ఇది.

ఈ రేడియేషన్‌కు మన కణాలను పాడు చేసేంత శక్తి లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ లాంటి సంస్థలు కూడా ఫోన్ రేడియేషన్‌పై చాలా పరిశోధనలు చేశాయి. ఇప్పటివరకు, ఫోన్ రేడియేషన్ వల్ల మెదడుకి హాని కలుగుతుందని లేదా క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
* ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమా..
ఫోన్ రేడియేషన్ అంత ప్రమాదకరమైనది కాకపోయినా ఫోన్‌ని తల దగ్గర పెట్టుకుని పడుకోవడం వల్ల వేరే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ స్క్రీన్ వెలుతురు, నోటిఫికేషన్ల శబ్దాలు మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. దీనివల్ల మీ సహజ నిద్ర చక్రం దెబ్బతింటుంది, సరిగ్గా నిద్ర పట్టక నీరసంగా అనిపిస్తుంది.
* మొబైల్ పేలవచ్చు, ప్రాణాలు పోవచ్చు
దిండు కింద ఫోన్ పెట్టుకోవడం వల్ల నిజంగా ప్రమాదం జరిగేది వేడెక్కడం వల్లే. ఫోన్ ఎక్కువసేపు వాడితే వేడెక్కుతుంది. ఇక ఛార్జింగ్ పెట్టి దిండు కింద పెడితే మరీ ప్రమాదం. ఒక్కోసారి ఛార్జర్ సరిగ్గా లేకపోయినా, బ్యాటరీ పాడైపోయినా ఫోన్ బాగా వేడెక్కి ఒక్కోసారి మంటలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
ఫోన్ పక్కనే పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పడుకునేటప్పుడు ఫోన్‌ని మంచానికి దూరంగా పెట్టడం మంచిది. ఫోన్ రేడియేషన్ వల్ల పెద్ద ప్రమాదం లేకపోయినా, అది మీ నిద్రను పాడు చేస్తుంది. అసలైన ప్రమాదం మాత్రం ఫోన్ వేడెక్కడం, పేలిపోవడం మంటలు ఎగిసి పడటం వల్ల అని గుర్తు పెట్టుకోవాలి.
* చిన్న సమస్యలు
ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే, ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోవడం వల్ల చాలా చిన్న చిన్న సమస్యలు కూడా వస్తాయి. రాత్రిపూట ఫోన్ దగ్గర పెట్టుకుంటే, మెలకువ రాగానే మొదటి పని ఫోన్ చూడటమే అవుతుంది. దీనివల్ల నిద్ర లేవగానే స్ట్రెస్‌గా అనిపించవచ్చు. అంతేకాదు, రాత్రిపూట నోటిఫికేషన్లు వస్తూ ఉంటే నిద్ర సరిగ్గా పట్టదు.
మళ్లీ మళ్లీ లేచి చూసే అవకాశం ఉంటుంది. ఇలా నిద్ర సరిగా లేకపోతే మరుసటి రోజు మొత్తం నీరసంగా, చిరాకుగా ఉంటుంది. పని మీద శ్రద్ధ పెట్టలేము, ఏ పని చేయాలన్నా సోమరితనంగా అనిపిస్తుంది. కొంతమందికి అయితే తలనొప్పి కూడా వస్తుంది.
కాబట్టి, ఫోన్ రేడియేషన్ క్యాన్సర్ కలిగించకపోయినా, మీ నిద్రకు, మీ రోజువారీ జీవితానికి మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే, ఫోన్‌ని బెడ్‌రూమ్‌లో కాకుండా వేరే గదిలో ఛార్జింగ్‌కు పెట్టడం లేదా కనీసం మంచానికి దూరంగా, సురక్షితమైన చోట పెట్టడం మంచిది.


Click it and Unblock the Notifications








