OLXలో అమ్మకానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం,విషయం ఏమిటి అంటే ?

కేరళ లో కాంగ్రెస్ రాజ్య సభ సీట్ కేటాయింపు వ్యవహారం పెద్ద దుమారాన్నే లేపినట్లు తెలుస్తోంది.

By Anil
|

కేరళ లో కాంగ్రెస్ రాజ్య సభ సీట్ కేటాయింపు వ్యవహారం పెద్ద దుమారాన్నే లేపినట్లు తెలుస్తోంది. తమ నాయకుడికి సీట్ ఇవ్వనందుకు ఏకంగా పార్టీ ఆఫీస్ నే OLX లో అనీష్ అనే పేరు మీద పోస్ట్ చేసి అమ్మకానికి పెట్టేసారు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు.పూర్తి వివరాల్లోకి వెళ్తే..

3 నెలలు ఇంటర్నెట్ ఫ్రీ, షియోమి బంపరాఫర్, పొందడం ఎలా ?3 నెలలు ఇంటర్నెట్ ఫ్రీ, షియోమి బంపరాఫర్, పొందడం ఎలా ?

కేరళ లో కాంగ్రెస్ రాజ్యసభ సీట్ మణి కు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధం కావడంతో కేరళలో కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కేపీసీసీ (కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ) కార్యకర్తలు పార్టీ కార్యాలయాన్ని OLX లో అమ్మకానికి పెట్టేసారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటిని olx అమ్మబోతున్నామంటూ ఓ యాడ్ ని ఉంచారు. ఈ పార్టీని రూ. 10,000 కు అమ్మబోతున్నామని , ఆసక్తి గల పార్టీలు కేరళ కాంగ్రెస్ (మణి) లేదా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) గాని సంప్రదించవచ్చని అందులో పేర్కొన్నారు.

olx

రాజ్యసభకు చెందిన పి.కె. కురియన్ వచ్చే నెల 1వ తేదీన పదవీ విరమణ చేయనుండటంతో ఈ సీటు మీద అందరికీ ఆసక్తి నెలకొంది. తరువాత ఈ సీటును ఎవరు సొంతం చేసుకోవాలనే దానిపై కేరళలో కాంగ్రెస్ నేతలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఈ సీట్ ను మణి కి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మణి కి సీటు ఇవ్వడంలో ఐయుఎంఎల్ సీనియర్ నాయకుడు పి.కె. కున్ హాలి కుట్టి కీలక పాత్ర పోషించారని సమాచారం.

ఈ విషయం మీద అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి ఓ లెటర్ రాశారు. ఈ నిర్ణయం మమ్మల్ని నిరాశకు గురిచేసిందని ఈ నిర్ణయం ద్వారా కేరళ కాంగ్రెస్ లో ప్రతికూల పవనాలు వీచే అవకాశం ఉందని లేఖలో తెలిపారు. ఇప్పటికే ఈ విషయం మీద కాంగ్రెస్ కార్యకర్తలు తమ అసమ్మతిని తెలియజేస్తున్నారని పార్టీకి ఇది నష్టం కలిగించే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే former KPCC president VM Sudheeran ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ నిర్ణయం తమను బాధించిందని బిజెపికి ఇది ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని మరొక్కసారి పునరాలోచించుకోవాలని కోరారు. ఈ విషయం మీద మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది నేతృత్వంలో KPCC political committe సమావేశం కానుంది. తరువాత పరిణామాలు ఏంటనేది ముందు ముందు చూడాలి.

Best Mobiles in India

Read more about:
English summary
Kerala Congress Office 'For Sale' on OLX Amid Drama Over Rajya Sabha Seat.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X