రైల్వే స్టేషన్‌లో వచ్చే ఉచిత వైఫై ఓ కూలి వాడి జీవితాన్ని మార్చేసింది

రైల్వే స్టేషన్లో వచ్చే ఉచితంగా వచ్చే వైపై ఓ రైల్వే కూలి జీవితాన్ని మార్చివేసింది. అతని భవిష్యత్తును బంగారు బాట చేసింది.

|

రైల్వే స్టేషన్లో ఉచితంగా వచ్చే వైపై ఓ రైల్వే కూలి జీవితాన్ని మార్చివేసింది. అతని భవిష్యత్తును బంగారు బాట చేసింది. చదివేందుకు డబ్బులు కూడా లేని ఆ కూలి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నంలో చివరిమెట్టు మీద ఉన్నాడు. తనకు తాను అవకాశాన్ని సృష్టించుకుని రైల్వే వైఫై ద్వారా ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టబోతున్న ఆ యువకుడిని తలుచుకుంటే అందరికీ ఓ మోడల్ అనిపించకమానదు. వివరాల్లోకెళితే.. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో శ్రీనాథ్ అనే కుర్రాడు సాధించిన ఈ విజయం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీనాథ్ తన కుటుంబ పోషణ కోసం గత ఐదేళ్లుగా కేరళలోని ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తున్నాడు.

రూ.6,790కే డ్యూయెల్ సెల్ఫీ కెమెరా ఫోన్,రూ.3,999కే 4జీ వోల్ట్ ఫోన్రూ.6,790కే డ్యూయెల్ సెల్ఫీ కెమెరా ఫోన్,రూ.3,999కే 4జీ వోల్ట్ ఫోన్

ఓ వైపు లగేజీలు మోస్తూనే ..

ఓ వైపు లగేజీలు మోస్తూనే ..

తోటి కూలీల మాదిరిగా కాకుండా ఓ వైపు లగేజీలు మోస్తూనే మరోవైపు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాఠాలు వినేవాడు. తన మిత్రుడి సూచన మేరకు అలా డిజిటల్ కోర్సు పాఠాలు విని, ప్రతిరోజూ సాయంత్రం నెమరువేసుకున్నాడు.

ఉచిత వైఫై సర్వీస్‌ను..

ఉచిత వైఫై సర్వీస్‌ను..

హైస్కూల్ విద్య పూర్తిచేసిన అతడు ఎర్నాకుళం రైల్వే స్టేషన్లోని ఉచిత వైఫై సర్వీస్‌ను తనకు అనుకూలంగా మార్చుకుని ఈ ఘనతను సాధించడం విశేషం. నేను ఇప్పటికి మూడు సార్లు పరీక్ష రాశాను. రైల్వే స్టేషన్లోని వైఫైని ఉపయోగించుకుని ప్రిపేర్ అవ్వడం ఇదే మొదటిసారంటూ తన మనసులో మాట చెప్పారు. 

ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని..

ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని..

ఓ వైపు లగేజీలు మోస్తూనే ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని స్టడీమెటీరియల్ వింటూ, ప్రశ్నలకు జవాబులు ఆలోచించేవాడిని. అలా పనిచేసేటప్పుడే ఏకకాలంలో పరీక్షలకు కూడా సిద్ధమయ్యాను. ప్రతిరోజూ పడుకునే ముందు, ఖాళీ సమయంలో ఆరోజు విన్న పాఠాలన్నీ గుర్తుచేసుకునేవాణ్ణి అంటూ శ్రీనాథ్ వివరించాడు.

ఇంటర్వ్యూ ఘట్టం దాటితే..

కేరళలోని మున్నార్‌కి చెందిన శ్రీనాథ్ కేపీఎస్‌సీ‌లో ఇంటర్వ్యూ ఘట్టం దాటితే రెవెన్యూ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగం సాధించేవరకు చదువుతూనే ఉంటాను. కుటుంబ పోషణకోసం పనిచేయక తప్పని సరి కావడంతో కూలీ పని చేస్తూనే పరీక్షలు రాస్తాను. ఎన్ని ఎక్కువ పరీక్షలు రాస్తే అంత మంచి ఉద్యోగం వస్తుంది...'' అని శ్రీనాథ్ చెబుతున్నాడు. ఈ విషయాన్ని Ani న్యూస్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. 

మంచి ఉద్యోగి ఎవరని ..

మంచి ఉద్యోగి ఎవరని ..

ఇంతకీ అతడి ఉద్దేశంలో మంచి ఉద్యోగి ఎవరని అడిగితే ఏం చెప్పాడో తెలుసా..‘‘గ్రామంలోని పరిస్థితులను మార్చగల అధికారం ఉన్న ఎవరో ఒకరు..'' అని చెప్పడం అతనిలోని మంచి గుణాన్ని తెలియజేస్తుంది కదా. 

డిజిటల్ ఇండియాలో భాగంగా..

డిజిటల్ ఇండియాలో భాగంగా..

డిజిటల్ ఇండియాలో భాగంగా 2016లో ప్రధాని నరేంద్ర మోడీ రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై సదుపాయానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నాటికి దేశవ్యాప్తంగా కనీసం 685 రైల్వే స్టేషన్లలో వైఫై టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు.

 2019 మార్చి నాటికి

2019 మార్చి నాటికి

2019 మార్చి నాటికి రూ.700 కోట్ల వ్యయంతో దేశంలోని మొత్తం 8,500 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం ఏర్పాటు కానుంది.

Best Mobiles in India

English summary
Kerala coolie uses railway WiFi to prepare for civil services, clears written test More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X