కేరళ జైలులో ఫేస్‌బుక్ లొల్లి!!

Posted By:

దారుణంగా హత్య చేసిన కేసులో కీలక నిందితులుగా గుర్తింపబడి కేరళలోని కోజికోడ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నకొందరు సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో చురుకుగా కొనసాగతున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కేరళకు చెందిన సీపీఐ-ఎం పార్టీకి చెందిన మాజీ నేత టీపీ చంద్రశేఖరన్ మే4, 2012న దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ఏడుగురు కేరళలోని కోజికోడ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.

కేరళ జైలులో ఫేస్‌బుక్ లొల్లి!!

వీరిలో కోడి సున్నీ, కిర్మాణి మనోజ్, మహ్మద్ షపీ అనే నిందితులు జైలు ప్రాంగణంలో కళ్లద్దాలతో ఫోజులిచ్చిన ఫోటోలు నిందితుల ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేయటాన్ని కేరళ మీడియా గుర్తించి సదరు ఫోటోలను ప్రసారం చేసింది. జైలులోని నిందితులకు ప్రత్యేక సౌకర్యాలు లభిస్తున్నట్లు వార్తలు రావడంతో జైలు అధికారులు ఈ ఘటన పై విచారణకు ఆదేశించారు.

తమ పరిశీలనలో జైలులో మొబైల్ ఫోన్ లు వినియోగిస్తున్నట్లు కనిపించలేదని, లోతైన పరిశోధన నిమిత్తం సైబర్ పోలీసుల సహాయం కూడా తీసుకుంటామని జైలు అధికారులు పేర్కొన్నారు. ఈ వార్త మీడియా ఛానళ్లలో కలకలం రేపటంతో కేరళ హోం మంత్రి రాధాకృష్ణన్ మంగళవారం కోజికోడ్ జైలును సందర్శించనున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot