విదేశీ పర్యాటకులను ఆకట్టకునే క్రమంలో కేరళ పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఫ్రెంచ్, జర్మన్ టూరిస్ట్‌ల కోసం ఆయా భాషాల్లో రెండు పేస్‌బుక్ అకౌంట్‌లను కేరళ పర్యాటక శాఖ ప్రారంభించింది. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే ఉద్దేశ్యంతో కేరళ మినహా దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన పర్యాటక శాఖ కూడా ఈ విధమైన ప్రచారానికి తెరలేపలేదు.
ఫ్రెంచ్ పర్యాటకుల కోసం కేరళ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్ పేజీ లింక్ అడ్రస్
కేరళ పర్యాటక శాఖ ఫేస్‌బుక్‌లో అధికారికంగా ప్రారంభించిన ఫ్రెంచ్ ఇంకా జర్మన్ పేస్‌బుక్ పేజీలు ఆయా భాషల వారికి కేరళ పర్యాటక ప్రాంతాలకు సంబంధించి ఉపయుక్తకరమైన సమాచారాన్ని అందిస్తాయి. కేరళ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునే ఫ్రెంచ్, జర్మన్ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఈ పేజీలను అనుసరించి తమ విహారయాత్రను రసవత్తరం చేసుకోవచ్చు.
జర్మన్ పర్యాటకుల కోసం కేరళ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్ పేజీ లింక్ అడ్రస్
ఏటా కేరళ పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారిలో ఫ్రెంచ్, జర్మన్ టూరిస్టుల సంఖ్య అత్యధిక శాతంగా నమోదవుతోంది. గతేడాది కేరళ రాష్ట్రాన్ని లక్ష మంది ఫ్రెండ్ టూరిస్ట్‌లు సందర్శించటం విశేషం. ముఖ్యంగా కేరళలో అందిస్తున్న ఆయుర్వేద వైద్యం విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.