Home
News

క్రెడిట్‌ కార్డు బ్లాక్‌ అయిందని ఫోన్‌ చేశారు.. ఏకంగా రూ.72 లక్షలు దోచుకున్నారు..!!

సైబర్‌ నేరాలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. అమాయకులు, వృద్ధులను టార్గెట్‌ చేస్తున్న నేరగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో ఇటీవల అనేక మంది అమాయకులను మోసం చేస్తున్నారు. భయాందోళనకు గురిచేసి గంటల తరబడి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సీబీఐ, ఈడీ, ఆర్‌బీఐ అధికారుల పేరు చెప్పి భారీగా దోచుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు ఎక్కువయ్యాయి. తాజాగా కేరళలో (Kerala Woman Loses RS72 Lakhs in Online Scam) ఓ మహిళలను మభ్యపెట్టి ఏకంగా రూ.72 లక్షల దోచుకున్నారు.

కేరళకు చెందిన 72 ఏళ్ల మహిళకు ఆగస్టు 23న ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. తనను రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు (RBI) చెందిన అధికారిగా పరిచయం చేసుకున్నాడు. వృద్ధురాలికి చెందిన క్రెడిట్‌ కార్డు భద్రతా కారణాల వల్ల బ్లాక్‌ అయిందని, వెంటనే అన్‌బ్లాక్‌ చేసుకోవాలని చెప్పాడు. కార్డుకు సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

Kerala woman loses RS72 lakhs

ఈ కాల్‌ అనంతరం మరో వ్యక్తి ఆ వృద్దురాలికి కాల్‌ చేశాడు. తనను CBI (కేంద్ర దర్యాప్తు సంస్థ) కు చెందిన అధికారిగా పరిచయం చేసుకున్నాడు. వృద్దురాలిపై మనీలాండరింగ్ కేసు నమోదు అయిందని తెలిపాడు. దీంతో ఆందోళనకు గురైన వృద్ధురాలిని మరింత ఆందోళనకు గురిచేశాడు. తమ విచారణ పూర్తయ్యే వరకు ఆన్‌లైన్‌, వీడియో కాల్‌లోనే ఉండాలని సూచించారు.

ఈ సమయంలో వృద్ధురాలి నుంచి అనేక విధాలుగా ఆమె బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. సుప్రీం కోర్టు, రిజర్వ్ బ్యాంకు ఆఫ్‌ ఇండియా పేరు చెప్పి నకిలీ పత్రాలను ఆమెకు చూపించారు. అయితే అవన్ని నిజమని నమ్మిన సదరు మహిళ బ్యాంకింగ్ సహా అనేక వివరాలను అందించారు. ఈ వివరాలతో ఆమె ఖాతా నుంచి ఏకంగా రూ.72 లక్షల నగదును తమ బ్యాంకు అకౌంట్లకు నేరగాళ్లు బదిలీ చేసుకున్నారు. ఆ నగదు అంతా మరలా వెనక్కి వస్తుందని నమ్మించారు.

ఇటీవల కాలంలో డిజిటల్‌ అరెస్ట్ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు అనేక మందిని మోసం చేస్తున్నారు. మీపై కేసులు నమోదయ్యాయని.. మీకు వచ్చిన పార్శిల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయంటూ బాధితులను ఆందోళనకు గురిచేస్తున్నారు. లక్షల్లో నగదును దోచుకుంటున్నారు.

ఇలాంటి కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా కాల్స్‌ వచ్చినప్పుడు ధ్రువీకరించుకోవాలని లేకుంటే పోలీసులు సహా సైబర్‌ క్రైం పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అయితే CBI, RBI లాంటి సంస్థలు ఎప్పుడు కూడా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్‌కు సంబంధించిన వివరాలు అడిగే అవకాశం లేదని చెబుతున్నారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Kerala woman loses RS72 lakhs in online scam here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X