భారతదేశంలో 6G టెక్నాలజీ అమలు వ్యూహంపై కీలక చర్చలు..

|

UN-మద్దతుగల ఫోరమ్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ లేదా ITU ఆరవ తరం లేదా 6G కోసం టెక్నాలజీలను అమలు చేయడంపై ఇండియా తన యొక్క అభిప్రాయాలను పరిశీలిస్తోంది. 2022 మధ్యకాలం నాటికి దానిపై నిర్ణయం తీసుకోవచ్చు అని కొన్ని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. జాతీయ స్టాండర్డ్ బాడీ ప్రతిపాదించిన అభిప్రాయాలు ఆమోదం పొందినట్లయితే కనుక భారతదేశంలో 6G టెక్నాలజీ యొక్క అమలు చేయడానికి మార్గం మరింత సులభం అవ్వడానికి సహాయపడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

భారతదేశంలో గ్రౌండ్ 6G టెక్నాలజీ ప్రారంభంపై బ్రేకింగ్ న్యూస్

భారతదేశంలో గ్రౌండ్ 6G టెక్నాలజీ ప్రారంభంపై బ్రేకింగ్ న్యూస్

టెలికమ్యూనికేషన్స్ విభాగం లేదా జాతీయ టెలికాం స్టాండర్డ్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (SDO)గా డిపార్ట్‌మెంట్ గుర్తించిన లాభాపేక్ష లేని పరిశ్రమతో కూడిన TSDSI గత సంవత్సరం 6G టెక్నాలజీలను ప్రారంభించే బాధ్యత కలిగిన ITU ఫోరమ్‌కు విజన్ డాక్యుమెంట్ మరియు సూచనలను సమర్పించింది . TSDSIలో వైస్ ఛైర్మన్ మరియు Jio ప్రమాణాలకు అధిపతి అయిన సతీష్ జమదగ్ని తెలిపిన ఒక ప్రకటన ప్రకారం TSDSI వర్కింగ్ గ్రూప్‌లలో 6G ఎనేబుల్ గురించి చర్చిస్తోంది.

6G

6Gని ప్రారంభించడం మరియు అది ఎలా ఉండాలనే దానిపై దేశం యొక్క పూర్తి దృష్టిని ITU పత్రాలలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ లేదా IMT-2030 అవసరాలలో భాగంగా 2022 జూలై నాటికి ITU తన అభిప్రాయాల ఆధారంగా తీర్పును ఇవ్వబోతోందని ఆయన తెలియజేశారు. మరోవైపు జెనీవా ఆధారిత యూనియన్ 6Gపై చర్చించడానికి 2030ని లక్ష్యంగా చేసుకుంది. ఆ తర్వాత 3GPP లేదా మూడవ తరం భాగస్వామ్య ప్రాజెక్ట్ ప్రమాణాలను రూపొందించడంలో పని చేయవచ్చు.

TSDSI
 

భారతదేశ ప్రమాణాల సంస్థ TSDSI 2020 ప్రారంభం నుండి 6G గురించి చర్చించడం ప్రారంభించింది. గ్లోబల్ స్టాండర్డ్ బాడీలతో సామరస్యంగా ఉంటూనే 6Gని ఎనేబుల్ చేయడానికి అవసరమైన సాంకేతికతలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశంలోనే జరుగుతున్న పరిశోధనలతో కూడిన సమగ్ర వ్యూహాన్ని ప్లాన్ చేసింది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు, టెక్నాలజీ విక్రేతలు మరియు చిప్‌సెట్ తయారీదారుల మద్దతుతో TSDSI దేశంలోని డిజిటల్ విభజనను తగ్గించడంలో సహాయపడే తదుపరి తరం టెక్నాలజీను ప్రారంభించడంతోపాటు సర్వత్రా మొబైల్ కనెక్ట్ చేయబడిన సమాజాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

DoT

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) కోసం మరియు సాంకేతికత కోసం కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి అంకితం చేయబడిన 6G టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్‌ను ఇటీవల రూపొందించింది. ఈ ఇన్నోవేషన్ గ్రూప్ భారతదేశంలో అభివృద్ధిలో ఉన్న మరియు 6Gలో భాగమయ్యే సాంకేతికతలను గుర్తించడానికి వాటాదారులు మరియు భాగస్వాముల కోసం DoT అడుగుతోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
key Discussions on 6G Technology Implementation Strategy in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X