ఇంటర్నెట్ ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిది, వెలుగులోకి కొత్త విషయాలు

Written By:

ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ రావడం డేటా ఆఫర్లు చీప్ కావడంతో అందరూ ఇంటర్నెట్ మీద తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇంటర్నెట్ వాడితే ఏదైనా ప్రమాదమా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోసం ఇప్పుడు కొత్తగా కొన్ని ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ఇంటర్నెట్‌ ఎక్కువగా వాడితే మనిషి సంతోషంగా ఉంటాడంటూ ఒక సర్వే తెలిపింది. అయితే అది వాడే విధానంపై ఆధారపడి ఉంటుందనీ, ఎంతసేపు ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేశామన్నది కాదు, దేని గురించి సెర్చ్ చేశాం అన్నది ముఖ్యమంటున్నారు పరిశోధకులు. నెట్‌ను ఎక్కువగా వాడేవారు చాలా సంతోషంగా ఉంటున్నారనీ యూరప్‌లో దాదాపు లక్ష మందిపై సర్వే చేశామని వారు పేర్కొన్నారు.

తక్కువ ధరతో నోకియా 1 వచ్చేసింది, ఆఫర్లే ఆఫర్లు బాసూ..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూనివర్సిటీ ఆఫ్‌ ఓస్లో పరిశోధకులు..

నార్వేలోని కల్చరల్ యూనివర్సిటీ ఆఫ్‌ ఓస్లో పరిశోధకులు దాదాపు లక్ష మంది పరిశోధనలు సాగించి ఈ ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. వారు తెలిపిన వివరాల ప్రకారం జీవితంలో సంతోషమనేది యూ(U) ఆకారంలో ఉంటుందని, ఒక వయసు వరకు సంతోషంగా ఉంటారనీ, వయసు పెరిగే కొద్దీ సంతోషంగా ఉండలేరనీ, మళ్లీ వృద్దాప్యంలో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందని సర్వేలో తేల్చారు.

ఆన్‌లైన్లో ఉండడం..

ఆన్‌లైన్లో ఉండడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగుపడతాయని, వారి స్నేహితులు, బంధువులతో నిత్యం టచ్‌లో ఉండటంతో వారు హ్యాపీగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

బాధను దరిచేరనీయకుండా

బాధను దరిచేరనీయకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, సమయపాలన, పాజిటివ్‌ థింకింగ్‌ చేయడం. నీతో నువ్వు స్నేహితుడిగా ఉండటం. మద్యపానానికి దూరంగా ఉండటం. మంచి డైట్‌ను పాటించటం. సమయానికి నిద్ర పోవడం. కష్ట సమయాల్లో తమ విషయాలను స్నేహితులు, ఆత్మీయులతో పంచుకుంటే చాలా ఉపశమనం ఉంటుందని వారు చెబుతున్నారు.

ఇంటర్నెట్‌ వాడకం వల్ల

కాగా ఇంటర్నెట్‌ వాడకం వల్ల మధ్య వయస్కుల్లో సంతోషంగా ఉండేవారి సంఖ్య పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. జర్మనీకి చెందిన మరో శాస్త్రవేత్త పైన చెప్పిన విషయాలతో ఏకీభవించలేదు.

లాభనష్టాలు రెండూ

ఇంటర్నెట్ వాడకం వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. మంచి, చెడు విషయాలకు వాడుకోవచ్చని ఇలా అన్నింటిని కలిపి ఇంటర్నెట్‌ అనే గొడుగు కిందకు చేర్చి కేవలం మంచి మాత్రమే జరుగుతుందని చెప్పలేమని పరిశోధకులు పేర్కొన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The secret to happiness? Use the internet every day: Scientists claim it boosts your mood by improving your social life and saving you time More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot