కికాస్ టొరెంట్స్ మళ్లీ వచ్చేసింది...

ప్రపంచపు అతిపెద్ద టొరెంట్ వెబ్‌సైట్ కికాస్ టొరెంట్స్ (KickassTorrents) కొత్త డొమైన్‌తో తిరిగి రీఓపెన్ అయినట్లు తెలుస్తోంది. యూఎస్ ఫెడరల్ అథారటీస్ కికాస్ టొరెంట్స్ ఒరిజినల్ వెబ్‌సైట్‌ను జూలైలో షట్‌డౌన్ చేసి, సైట్ నిర్వాహకుడిని
అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, కికాస్ టొరెంట్స్‌కు సంబంధించిన సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న నేపథ్యంలో వీటిని డౌన్ చేయటం యూఎస్ ఫెడర్ అథారటీస్‌కు మరింత కష్టతరంగా మారుతోంది.

Read More : క్రిస్మస్, న్యూఇయర్ డిస్కౌంట్స్ పై 10 స్మార్ట్‌‍ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సీజ్ చేసినప్పటికి..

కికాస్ టొరెంట్స్ వెబ్‌సైట్‌కు సంబంధించి డొమైన్ పేర్లను సీజ్ చేసినప్పటికి టొరెంట్‌లకు సంబంధించిన ఒరిజినల్ డేటా బేస్ అలానే కమ్యూనిటీ అలానే ఉన్నట్లు సమాచారం.

Katcr.co పేరుతో..

ఈ నేపథ్యంలో పాత కికాస్ వెబ్‌సైట్‌లకు పనిచేసిన ఫోరమ్ అడ్మిన్స్, మాడరేటర్స్, మెంబర్స్ తిరిగి ఒక్కటిగా చేరి ఒరిజినల్ కికాస్ వెబ్‌సైట్ తరహాలోనే Katcr.co పేరుతో కొత్త డొమైన్‌ను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. పాత కికాస్ టొరెంట్స్ తరహాలోనే ఈ సైట్ లో కూడా సినిమాలకు సంబంధించిన ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారట.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏ భాషలో సినిమా విడుదలయినా..

ఏ భాషలో సినిమా విడుదలయినా సరే అది మరుసటి రోజుకల్లా కికాస్ టొరెంట్స్ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చేది. దీంతో చాలామంది సినిమాను రిలీజయిన తరువాత రోజే డౌన్ లోడ్ చేసుకుని చూడటం వల్ల నిర్మాతల రెవిన్యూ పై దెబ్బ పడేది. అయితే ఇది ఎవరు చేస్తున్నారనే విషయం మాత్రం జూలై 2016 ఎవ్వరికీ తెలియలేదు, అయితే ఇప్పుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడు. పట్టించింది ఎవరో కాదు ఆపిల్ కంపెనీ.

సూత్రదారి ఆర్టెమ్ వాలిన్

'కిక్ ఆస్ టోరెంట్స్' అనే పైరసీ వెబ్‌సైట్‌ని నడుపుతున్న వ్యక్తి పేరు ఆర్టెమ్ వాలిన్. ఉక్రెయిన్ దేశానికి చెందిన వాలిన్‌ను పోలీసులు పోలాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

ఐక్లౌడ్ కంప్యూటింగ్‌ ద్వారా..

ఈ దొంగ వివరాలు తెలియజేసిన క్రెడిట్ మాత్రం ప్రముఖ సంస్థ 'ఆపిల్'కే దక్కుతుంది. తన ఐక్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉన్న వాలిన్ వివరాలను అమెరికా పోలీసులకు అందించింది.

కాపీరైట్ ఉల్లంఘన..

ఇప్పటికే వాలిన్ పై కాపీరైట్ ఉల్లంఘన, మనీ లాండరింగ్ తో పాటు పలు కేసులు నమోదు అయ్యాయి. తన ఆచూకీ ఎవరికీ తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో వాలిన్ తరచుగా మకాం మారుస్తూ పలు దేశాలకు వెళుతుండేవాడు.

రూ.6,724 కోట్ల అభియోగం

ఆర్టెమ్ వాలిన్‌కు సంబంధించిన ఒక బ్యాంకు అకౌంట్‌తో పాటు వెబ్‌సైట్‌కు అనుబంధంగా ఉన్న ఏడు డొమైన్ నేమ్స్‌ను కూడా పోలీసులు నిలిపి వేశారు. దరిదాపుగా రూ.6,724 కోట్ల విలువ చేసే సినిమాలు, సంగీతం తదితరాలను చట్టవిరుద్ధంగా ఇతడు కాపీ చేసినట్లు ఇతగాడి పై అభియోగం.

69వ వెబ్‌సైట్‌గా పేరు తెచ్చుకుంది

ప్రపంచ వ్యాప్తంగా 28 భాషలకు సంబంధించిన సినిమాలను పైరసీ చేసి తన వెబ్ సైట్ ద్వారా వాలిన్ అందిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఇంటర్నెట్లో అందరూ సెర్చ్ చేసే 69వ వెబ్‌సైట్‌గా పేరు తెచ్చుకుంది. 28 భాషల్లో సేవలు అందిస్తోంది. ఏటా వాణిజ్య ప్రకటనల నుంచి సుమారు రూ.150 కోట్ల వరకు ఆదాయం వస్తోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Kickass Torrents Makes a Comeback, Maintains the Original Look With Much Safer Content. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot