కీప్యాడ్ సౌకర్యంతో కింగ్‌స్టన్ పెన్‌డ్రైవ్‌, ధర ఎంతంటే..?

ప్రముఖ యూఎస్బీ స్టోరేజ్ ఉత్పత్తుల తయారీ కంపెనీ కింగ్‌స్టన్, డేటా ట్రావెలర్ 2000 (డీటీ2000) పేరుతో సరికొత్త పెన్‌డ్రైవ్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్ సౌకర్యంతో వస్తోన్న ఈ పెన్‌డ్రైవ్‌ను సులువుగా లాక్ చేసుకోవచ్చు. 16జీబి వేరియంట్ ధర రూ.10,000, 32జీబి వేరియంట్ ధర రూ.14,000, 64జీబి వేరియంట్ ధర రూ.18,000. ఆన్‌లైన్ అలానే రిటైల్ స్టోర్‌లలో ఈ యూఎస్బీ ఫ్లాష్‌డ్రైవ్‌లను పొందవచ్చు.

కీప్యాడ్ సౌకర్యంతో కింగ్‌స్టన్ పెన్‌డ్రైవ్‌, ధర ఎంతంటే..?

మీ ఫోన్ వాల్‌పేపర్ గంటగంటకి మారిపోవాలా..?

హార్డ్‌వేర్ ఎన్‌క్రిప్షన్‌తో పాటు పిన్ ప్రొటెక్షన్‌ను డేటా ట్రావెలర్ 2000 పెన్‌డ్రైవ్‌ ఆఫర్ చేస్తుంది. ఈ యూఎస్బీ డ్రైవ్‌లో నిక్షిప్తం చేసిన బిల్ట్-ఇన్ ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్ ద్వారా ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ (వర్డ్ లేదా నెంబర్ కాంభికేషన్)ను మీరు సెట్ చేసుకోవచ్చు. పెన్‌డ్రైవ్‌‌ను కనెక్ట్ చేసిన ప్రతిసారి పాస్‌వర్డ్‌‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. కంప్యూటర్ నుంచి పెన్‌డ్రైవ్‌ను డిస్కనెక్ట్ చేసిన వెంటనే లాక్ యాక్టివేట్ అయిపోతోంది. వరసగా 10 సార్లు తప్పు పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసినట్లయితే పెన్‌డ్రైవ్‌‌లోని డేటా తనంతటతానే డిలీట్ అయిపోతుంది.

కీప్యాడ్ సౌకర్యంతో కింగ్‌స్టన్ పెన్‌డ్రైవ్‌, ధర ఎంతంటే..?

ఎలాంటి వెబ్‌సైట్ నుంచైనా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

అనేక రకాల ఆపరేటింగ్ సిస్టంలతో పాటు అనేక రకాల డివైస్‌లను ఈ యూఎస్బీ ఫ్లాష్‌డ్రైవ్‌ సపోర్ట్ చేస్తుంది. XTS modeలో AES 256-bit data encryptionను ఈ పెన్‌డ్రైవ్‌ ఆఫర్ చేస్తుంది. ఈ పెన్‌డ్రైవ్‌ను హోస్ట్ చేసేందుకు ఏ విధమైన సాప్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్ అవసరం ఉండదు. FIPS 197 సర్టిఫికేషన్‌తో వస్తోన్న నీటి ప్రమాదాలతో పాటు దుమ్ము ప్రమాదాలను సమర్ధవంతంగా ఎదుర్కొగలదు.

ఇంటర్నెట్‌లో ఇలాంటి పనులు చేస్తే జైలుకే..?

English summary
Kingston launches USB Flash drive with an alphanumeric keypad. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting