గేమింగ్ పార్కుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన

Posted By:

గేమింగ్ పార్కుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో గేమింగ్, యానిమేషన్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ (గేమ్) పార్కుకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 ఏకరాల విస్తీర్ణంలో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా గేమింగ్ యానిమేషన్ విభాగంలో 15,000 మంది ఉపాధి లభిస్తుందని అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతూ 65వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిందని అన్నారు. భవిష్యత్‌లో మరింత కీలకం కానున్న యానిమేషన్ పరిశ్రమ హైదరాబాద్‌కు రావటం సంతోషకరమైన విషయమని రాష్ట్ర మంత్రి పోన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు.

నేటి తరం విద్యార్థులను ఆకర్షిస్తున్న ప్రధాన విద్యా కోర్సులలో యానిమేషన్ ఒకటి. ఈ రంగంలో తమ భవిష్యత్‌ను తీర్చుదిద్దుకోవాలనే తపనతో పలువురు విద్యార్థులు ఉన్నారు. యానిమేషన్ రంగంలోకి ప్రవేశించాలనుకునే విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ పూర్తి చేసినట్లయితే విభిన్నమైన యానిమేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

యానిమేషన్ కేవలం వినోద రంగానికి మాత్రమే పరిమితమైందనుకుంటే పొరబడినట్లే యానిమేషన్ ప్రక్రియ నేడు అన్ని రంగాలకు విస్తరించింది. ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్, విద్య, వైద్యం, ఆటోమొబైల్ ఇలా ఎన్నో రంగాల్లో యానిమేషన్ విద్య దోహదపడుతుంది. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునేవారికి చిత్రలేఖనంలో నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఉపయోగించటం తెలుసి ఉండాలి. ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. సృజనాత్మకత, ఊహాశక్తి, నిశిత పరిశీలన ఉన్న వారు మంచి యానిమేటర్లుగా రాణించగలగుతారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot