స్టూడెంట్స్ కోసం అలా...?

By Super
|
KloudPad Android 4 tablet with 3G debuts in India


మార్కెట్లో లభ్యమవుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టాబ్లెట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి ప్రముఖ కంపెనీలు మొదలుకుని బీఎస్‌ఎన్‌ఎల్ వంటి దిగ్గజ టెలికాం ఆపరేటర్ల వరకు టాబ్లెట్ కంప్యూటర్లను లాంచ్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరొకటి వచ్చి చేరబోతోంది. పేరు క్లౌడ్‌ప్యాడ్ (KloudPad).త్రివేండ్రంలో ఈ డివైజ్‌ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్ధులకు అవసరమైన అనేక అంశాలను ఈ పరికరంలో నిక్షిప్తం చేశారు. CBSE & ICSE కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైజ్‌లో ముందుగానే ఇన్‌బుల్ట్ చేశారు. ఈ ఫీచర్ విద్యార్థులకు మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. టాబ్లెట్‌లో కాలింగ్ నిర్వహించేకునేందుకు వీలుగా ‘3జీ’స్లిమ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సౌలభ్యతతో 3జీ వేగంతో కూడిన మొబైలింగ్ నిర్వహించుకోవచ్చు. ఇతర ఫీచర్లు:

- 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ రిసల్యూషన్ ( 800 x 480పిక్సల్స్) ,

- కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్ (ప్రాసెసింగ్ వేగం 1.2గిగాహెడ్జ్),

- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

- 4జీబి ఇంటర్నల్ మెమెరీ,

- 512ఎంబీ ర్యామ్,

- ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి,

- క్వాలిటీ ఫ్రంట్ కెమెరా,

- వై-ఫై కనెక్టువిటీ,

- హెచ్‌డిఎమ్ఐ అవుట్,

- యూఎస్బీ సపోర్ట్,

- 6 గంటల బ్యాకప్ నిచ్చే 4000 mAH బ్యాటరీ.

ఇవే కాకుండా మరిన్నిఅదనపు సౌలభ్యతలను వినియోగదారులు ఆస్వాదించవచ్చు. మెడికిల్, ఇంజనీరింగ్ విద్యార్థులకు అవసరమైన శాంపిల్ టెస్ట్ పేపర్లను Attano సౌజన్యంతో క్లౌడ్ ప్యాడ్ అందిస్తుంది. నిక్షిప్తం చేసిన Edu TV, Attano ఈ-బుక్

అప్లికేషన్‌లు యూజర్‌కు మరింత ఉఫయుక్తంగా నిలుస్తాయి. ధర అంచనా రూ.9,999. ఔత్సాహికులు slatestore.in ద్వారా ఈ డివైజ్‌ను కోనుగోలు చెయ్యవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X