5G సపోర్టు చేసే OnePlus స్మార్ట్‌ఫోన్‌ జాబితా ఇదే.. చెక్ చేసుకోండి!

|

OnePlus కంపెనీ తమ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. మరియు ఈ కొత్త అప్‌డేట్ Jio 5G నెట్‌వర్క్ కు సపోర్టు చేస్తుంది. కంపెనీ ఇప్పుడు OnePlus Nord 5G మరియు OnePlus Nord CE 5G ఫోన్‌ల కోసం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందిస్తోంది.

oneplus

OnePlus ఇప్పటికే కొన్ని ఫోన్‌లకు 5G సపోర్ట్‌తో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ప్రారంభించింది. కొన్ని వారాల క్రితం కంపెనీ OnePlus 10R, OnePlus 10T మరియు OnePlus 10 Pro కోసం సాఫ్ట్‌వేర్ అప్డేట్ ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు OnePlus Nord 5G ఫోన్ కు OxygenOS (OxygenOS C.08) అప్డేట్ అందిస్తోంది. మరియు OnePlus Nord CE 5G ఫోన్కు ఆక్సిజన్‌ఓఎస్ (OxygenOS F.16)ను అందిస్తోంది. ఈ కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ యొక్క నెట్‌వర్క్ అప్‌డేట్‌తో పాటు ఫోన్‌ల సిస్టమ్ స్టెబిలిటీని మెరుగుపరుస్తుంది. ఇది Jio 5G నెట్‌వర్క్ సేవను కూడా సపోర్ట్ చేస్తుంది.

అప్‌డేట్ చేయడానికి ఈ పద్దతి పాటించండి:

అప్‌డేట్ చేయడానికి ఈ పద్దతి పాటించండి:

మీరు OnePlus Nord 5G మరియు OnePlus Nord CE 5G వినియోగిస్తున్నట్లయితే.. మీరు కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడానికి ముందుగా మీ ఫోన్ సెట్టింగ్‌ల యాప్‌ని తెరవండి. ఆపై అబౌట్ డివైజ్ అనే సెక్షన్ ను ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత అందులో మీకు అప్‌డేట్ కనిపిస్తుందో లేదో చూడండి. అప్‌డేట్ అందుబాటులో ఉంటే, డౌన్‌లోడ్ బటన్‌పై నొక్కండి.

5G సపోర్టు ఉన్న OnePlus స్మార్ట్‌ఫోన్‌ల జాబితా ఇక్కడ ఉంది:

5G సపోర్టు ఉన్న OnePlus స్మార్ట్‌ఫోన్‌ల జాబితా ఇక్కడ ఉంది:

OnePlus Nord
OnePlus 9
OnePlus 9 Pro
OnePlus Nord CE
OnePlus Nord CE 2
OnePlus 10 Pro 5G
OnePlus Nord CE LITE 2
OnePlus 10R
OnePlus Nord 2
OnePlus Nord 2T
OnePlus 10T
OnePlus 8
OnePlus 8T
OnePlus 8 Pro
OnePlus 9RT
OnePlus Nord 2
OnePlus 9R

మీ స్మార్ట్‌ఫోన్ 5Gని సపోర్ట్ చేస్తుందా?..ఇలా చెక్ చేయండి:
 

మీ స్మార్ట్‌ఫోన్ 5Gని సపోర్ట్ చేస్తుందా?..ఇలా చెక్ చేయండి:

స్టెప్ 1: మీ ఫోన్‌లో, సెట్టింగ్‌ల యాప్‌కి వెళ్లండి
దశ 2: ఆపై 'Wi-Fi మరియు నెట్‌వర్క్' ఎంపికపై క్లిక్ చేయండి
దశ 3: ఆపై 'SIM మరియు నెట్‌వర్క్‌పై క్లిక్ చేయండి '
దశ 4: 'ప్రాధాన్య నెట్‌వర్క్ రకం' ఎంపికలో మీరు అందుబాటులో ఉన్న నెట్‌వర్క్ సమాచారాన్ని చూడగలరు.
దశ 5: మీ ఫోన్ 5Gకి మద్దతిస్తే, అది 2G / 3G / 4G / 5Gగా జాబితా చేయబడుతుంది. జాబితాలో 5జీ ఉన్నట్లయితే మీ ఫోన్ 5జీకి సపోర్టు చేస్తుందని నిర్దారించుకోవాలి.

ఎయిర్‌టెల్ 5G లభ్యత నగరాలు ఎయిర్‌టెల్ యొక్క 5G నెట్‌వర్క్ సేవలు ముంబై, ఢిల్లీ, వారణాసి, చెన్నై, సిలిగురి, నాగ్‌పూర్, హైదరాబాద్ మరియు బెంగళూరుతో సహా ఎనిమిది నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టెలికాం మరిన్ని నగరాలకు చేరుకుంటుందని అంచనా.

జియో కూడా ఇప్ప‌టికే నాలుగు న‌గ‌రాల్లోకి ఎంట్రీ!

జియో కూడా ఇప్ప‌టికే నాలుగు న‌గ‌రాల్లోకి ఎంట్రీ!

భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ Jio కూడా తన 5G సేవల విష‌యంలో ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేసింది. భారతదేశంలోని నాలుగు నగరాల్లో 5జీ సేవ‌లు అందుబాటులో తెచ్చంది. ఈ నగరాల్లో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు వారణాసి ఉన్నాయి. ఈ నగరాల్లో Jio సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసిన సబ్‌స్క్రైబర్‌లు 5G సేవలను ఉప‌యోగించుకోగ‌ల‌రు అని పేర్కొంది. జియో 5జీ సేవ‌ల‌కు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అర్హ‌త క‌లిగిన‌ వినియోగ‌దారుల‌కు ఇన్విటేష‌న్ పంపుతుంది. MyJio యాప్ ద్వారా కస్టమర్‌లకు జియో 5జీ సేవ‌ల ఇన్విటేష‌న్ అందుతుంది. ఇన్విటేష‌న్ రాని వినియోగదారులు తమ ఫోన్‌లలో MyJio యాప్‌ని ఓపెన్ చేసి, 5జీ సేవ‌ల‌కు సంబంధించి తమకు ఇన్విటేష‌న్ చెక్ చేసుకోవాలి.

Best Mobiles in India

English summary
know the List of oneplus smartphones which supports 5G.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X