Home
News

హైస్పీడ్ ఇంటర్నెట్: రెండు గంటల సినిమా 30 సెకన్లలో డౌన్‌లోడ్!

By Prashanth
Kochi Gets India’s First Gigabit Internet Connectivity


ప్రపంచపు అతివేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ ఇప్పుడు భారత్‌ను తాకింది. 1జీబీపీఎస్ సామర్ధ్యం గల ఇంటర్నెట్ సేవలలను కొచ్చి పట్టణంలోని స్టార్ట్‌అప్ విలేజ్‌లో ప్రారంభించనున్నారు. దింతో 1జీబీపీఎస్ ఇంటర్నెట్ యాక్సిస్‌ను పొందిన రెండవ దేశంగా ఇండియా గుర్తింపు తెచ్చుకుంది. ఈ హైస్సీడ్ ఇంటర్నెట్ సేవలను తొలిగా యూఎస్‌లోని కన్నాస్ సిటీ స్టార్ట్‌అప్ విలేజ్ ఆవరణలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రారంభించింది. 1జీబీపీఎస్ కనెక్టువిటీ సాయంతో రెండు గంటల సినిమాను కేవలం 30 సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పైలెట్ ప్రాజెక్టు‌ను త్వరలోని దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విస్తరింపచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్టార్ట్‌అప్ విలేజ్ చైర్మన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అల్ట్రా-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టువిటీ నెటిజనులకు ఉత్తమ స్థాయి ఇంటర్నెట్ అనుభూతులను చేరువచేస్తుంది.

రిటైల్ బ్రాండ్ బ్యాండ్ యూజర్లు త్వరలో అల్ట్రా-హైస్పీడ్ ఇంటర్నెట్!

రిటైల్ బ్రాండ్ బ్యాండ్ యూజర్లు త్వరలో అల్ట్రా-హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందుకోనున్నారు. సెకనుకు 1గిగాబైట్ డౌన్‌లోడింగ్ సామర్ధ్యం కలిగిన ఈ బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ 2013 మధ్య నాటికి అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా 9 పట్టణాల్లో ఈ ప్లాన్ అందుబాటులోకి రానుందని రేడియస్ ఇన్‌ఫ్రా‌టెల్ తెలిపింది. ఈ ప్లాన్ అందుబాటులోకి వస్తే రెండు గంటల నిడివి కలిగిన హైడెఫినిషన్ సినిమాను కేవలం 30 సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రేడియస్ ఇన్‌ఫ్రా‌టెల్ సీఈవో రాజ్‌నిష్ వాహి తెలిపారు. గృహవినియోగానికి సైతం ఈ సరికొత్త 1జీబీపీఎస్ బ్రాడ్ బ్యాండ్ స్పీడ్‌ప్లాన్ అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్‌బ్యాండ్ స్పీడ్‌లతో రెండు గంటల నిడివి కలిగిన హైడెఫినిషన్ సినిమాను డౌన్‌లోడ్ చేయలంటే కనీసం గంట సమయం తీసుకుంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా డీఎల్ఎఫ్, ఎమ్మార్ ఎంజీఎఫ్, వోమాక్సీ, పారామంట్, ప్రటీక్ వంటి సంస్థలతో ఒప్పందం కుదర్చుకున్నట్లు ఇన్‌ఫ్రా‌టెల్ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం 100మెగా బిట్ పర్ సెకండ్ ప్లాన్‌లను ప్రముఖ టెలికం ఆపరేటర్‌లు భారతి ఎయిర్ టెల్, టాటా టెలీ‌సర్వీస్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ఈ ప్లాన్ ధర అంచనా రూ.5,000 (నెలకు).

Read In English

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X