బడ్జెట్ ధరలో స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా.. 43 అంగుళాల డిస్‌ప్లే, JioTele OS తో QLED TV విడుదల..!
Kodak 43 inchs QLED TV : భారత్ మార్కెట్ లో స్మార్ట్ టీవీలకు మంచి డిమాండ్ ఉంది. ఫలితంగా అనేక సంస్థలు అందుబాటు ధరలో టీవీలను విడుదల చేస్తున్నాయి. అయితే తాజాగా Kodak సంస్థ QLED స్మార్ట్‌టీవీని లాంచ్ చేసింది. భారత్‌లోనే ఈ స్మార్ట్‌టీవీని తయారు చేసినట్లు తెలిపింది. ఈ టీవీ డాల్బీ ఆడియో టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. మరియు jioTele OS పైన పనిచేస్తుంది.
డిస్‌ప్లే వివరాలు :
కోడాక్ QLED స్మార్ట్‌టీవీ 43 అంగుళాల డిస్‌ప్లే సైజ్ వేరియంట్ లో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 4K రిజల్యూషన్‌తో 3840 x 2160 పిక్సల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంది. మరియు ఈ టీవీ 60Hz రీఫ్రెష్ రేట్, బెజిల్ లెస్ డిజైన్‌ను కలిగి ఉంది.

డాల్బీ ఆడియో టెక్నాలజీ :
ఈ టీవీ QLED డిస్‌ప్లే టెక్నాలజీ కారణంగా హై క్వాలిటీ విజువల్స్ ను అందిస్తుంది. మొత్తంగా ఈ డిస్‌ప్లే మెరుగైన అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది. ఈ కోడాక్ QLED స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. మెరుగైన సౌండ్ అవుట్‌పుట్ ను అందించేలా 30 Watts స్పీకర్‌లను కలిగి ఉంది.
JioTele OS :
ఈ స్మార్ట్‌టీవీ ఇటీవల అందుబాటులోకి వచ్చిన JioTele OS పైన పనిచేస్తుంది. ఇందులో Miracast, ఇన్ బిల్ట్ వైఫై వంటి ఫీచర్లున్నాయి. జియో స్టోర్ ద్వారా 200 యాప్స్ వరకు అందిస్తుంది. దీంతోపాటు 300 ఉచిత లైవ్ టీవీ ఛానల్స్‌ను వీక్షించవచ్చు. 300 జియో గేమ్స్ పొందవచ్చు.

కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌టీవీ మూడు HDMI పోర్టులను కలిగి ఉంది. సెట్ టాప్ బాక్స్, స్పీకర్లు, గేమింగ్ కన్సోల్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు రెండు USB పోర్టులను కలిగి ఉంది. USB, హార్డ్ డ్రైవ్ లను కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు బిల్ట్ ఇన్ వైఫై ను కలిగి ఉంది.
ఈ QLED స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 8GB ROM సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ లో ప్రత్యేకంగా స్పోర్ట్స్ మోడ్‌ను కలిగి ఉంది. మీకు కావాల్సిన కంటెంట్ వచ్చేలా ప్రత్యేకమైన ఫీచర్లున్నాయి. ఈ స్మార్ట్ టీవీ జియో సినిమా, జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ సహా అనేక ప్లాట్‌ఫామ్స్ ను సపోర్టు చేస్తుంది.
ఈ స్మార్ట్‌టీవీ సంవత్సరానికి 65 kWh విద్యుత్ ను వినియోగించుకుంటుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు ఈ టీవీ రిటైల్ ప్యాక్ లో టీవీ యూనిట్‌తోపాటు రిమోట్ కంట్రోల్, రెండు బ్యాటరీలు, ఇన్‌స్టాలేషన్ కు అవసరం వస్తువులను అందిస్తుంది.
స్మార్ట్ టీవీ ధర, సేల్ వివరాలు :
Kodak QLED TV (KQ43JTV0010) ధర రూ.18999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ కొనుగోలుపై సంవత్సరం వారంటీ మరియు 6 నెలల వరకు సంబంధిత ఉపకరణాలపై వారంటీని అందిస్తున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications








