కెమెరా అభిమానులకు నిరాశ.. కోడాక్ నిర్ణయం..!

Posted By: Staff

కెమెరా అభిమానులకు నిరాశ.. కోడాక్ నిర్ణయం..!

 

ప్రముఖ కెమెరాల కంపెనీ కోడాక్ తాము తయారు చేస్తున్న కెమెరాలు మరియు డిజిటల్ ఫ్రేమ్‌లను అధికారకంగా ఆపివేయనున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యతను కల్పించిన కెమెరాలు, డిజిటల్ ఉత్పత్తులకు కాలం ముగిసి పోతుందా..? అని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇలా సడన్‌గా కోడాక్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం  'ఈస్ట్‌మాన్ కోడాక్ కో' దివాలా తీయడమేనని ప్రధాన కారణంగా పేర్కొంది. 132 సంవత్సరాల చరిత్ర కలిగిన కోడాక్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అరుదైన, నాణ్యమైన కెమెరాలను పరిచయం చేయడమే కాకుండా.. వారి యొక్క ఊహా చిత్రాలను సైతం ముంగిట నిలిచేలా చేశాయి.

జపనీస్ కెమెరా తయారీదారైన 'కోడాక్' నిపుణులు వెల్లడించిన దాని ప్రకారం ఈ సమస్య నుండి బయట పడలేకే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. డిజిటల్ కెమెరా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించిన కోడాక్ అభిమానులు  'ఈస్ట్‌మాన్ కోడాక్ కో' తీసుకున్న నిర్ణయంతో ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో మొదటి డిజిటల్ కెమెరా కనుగొన్న కోడాక్ ఇంజనీర్ స్టీవెన్ సస్సన్  ఈ సందర్బంలో మాట్లాడుతూ సెల్ ఫోన్స్‌, డిజిటల్ పరికరాలలో ఉపయోగించే  ఫోటో సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేసేందుకు గాను కోడాక్ కంపెనీ $ 5 బిలియన్స్‌ని ఖర్చు పెట్టిందని అన్నాడు.

అలాంటి కెమెరా కంపెనీ కోడాక్ సడన్‌గా ఇలాంటి నిర్ణయం తనని ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. ప్రపంచంలో ఉన్న అభిమానులు అందరూ కూడా కోడాక్ ఉత్పత్తులు.. ముఖ్యంగా కెమెరాలను మిస్ అవుతున్నందుకు తనికి చాలా బాధగా ఉందని అన్నాడు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting