ప్రింట్ న్యూస్ పేపర్స్‌ని 'పేపర్ బాయ్' ద్వారా డిజిటల్ లోకి..

Posted By: Super

ప్రింట్ న్యూస్ పేపర్స్‌ని 'పేపర్ బాయ్' ద్వారా డిజిటల్ లోకి..

కోబా స్విస్ టెక్నాలజీ కంపనీ. టెక్నాలజీకి కొత్త ఆలోచన సృష్టించడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. ఇటీవల కంపెనీ కొత్తగా విడుదల చేసిన 'పేపర్ బాయ్' అప్లికేషన్ ప్రింట్ మీడియా డిజిటల్ రంగంలో నూతన ఒరవడిని సృష్టించడానికి సిద్దమైంది. ఈ అప్లికేషన్ ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే పేపర్‌లో మీకు నచ్చిన ఏదైనా ఆర్టికల్‌ని ఫోటో మాదిరి స్నాఫ్ షాట్ తీసి డైరెక్టుగా ఆన్ లైన్‌లో స్నేహితులతో షేర్ చేసుకొవచ్చు. లేదంటే వీటిని ఆర్చివ్స్ రూపంలో మీ ఫోన్‌లో సేవ్ చేసుకొని ఆ తర్వాత ఖాలీ సమయంలో చదువు కొవచ్చు.

ఇది మాత్రమే కాకుండా ఆన్ లైన్‌లో ప్రచురింపబడే ఆర్టికల్స్‌లలో ఏదైనా కొత్తగా కంటెంట్(వీడియోలు, ఇమేజిలు) యాడ్ చేసిన అటువంటి వాటిని కూడా మీరు ఆ తర్వాత ఈ 'పేపర్ బాయ్ అప్లికేషన్' యాక్సెస్ చేసుకొవచ్చు. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా పేపర్ బాయ్ అప్లికేషన్‌ని సపోర్ట్ చేస్తున్న న్యూస్ పేపర్స్ చాలా తక్కువ. ప్రపంచం మొత్తం మీద 90 దేశాలలో 2000 న్యూస్ పేపర్స్‌లతో మాకు సంబంధాలున్నాయని కోబా కంపెనీ ప్రతినిధి తెలియజేశారు.

మొట్టమొదటి దశలో జర్మనీలో 85 న్యూస్ పేపర్స్ టైటిల్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియాలలో ఉన్న న్యూస్ పేపర్స్ టైటిల్స్‌కి ఈ పేపర్ బాయ్ అప్లేకేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇక రెండవ దశ నవంబర్‌లో ప్రారంభం చేయనున్నామని తెలియజేశారు. ఈ దశలో అమెరికాకు చెందిన 780 న్యూస్ పేపర్స్, లండన్, కెనడియన్ న్యూస్ పేపర్స్‌ని అనుసంధానం చేయనున్నామని అన్నారు. మిగిలిన ప్రపంచానికి ఈ అప్లికేషన్‌ని ఈ సంవత్సరం చివరలో అందిస్తామని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot