యూట్యూబ్‌లో ప్రభంజనం సృష్టిస్తున్నగ్యాంగ్‌నమ్ స్టైల్ హీరో కొత్త వీడియో!

Posted By:

తన ‘గ్యాంగ్‌నమ్‌ స్టైల్' మ్యూజిక్ డ్యాన్స్ వీడియోతో యూట్యూబ్ రికార్డులను తిరగరాసిన సౌత్ కొరియన్ పాప్‌స్టార్ ‘సై హూ'(Psy who), ‘జెంటిల్‌మ్యాన్' పేరుతో సరికొత్త డ్యాన్స్ మ్యూజిక్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసి సరికొత్త సంచలనానికి నాంది పలికారు.

శనివారం రాత్రి 9 గంటలకు యూట్యూబ్‌లో విడుదలైన ఈ వీడియో సోమవారం నాటికి 44మిలియన్‌ల వీక్షణలను దక్కించుకుంది. మొదటి 24 గంటల్లో ఈ వీడియోకు 20 మిలియన్ హిట్స్ దక్కటం విశేషం. మునుపటి రికార్డులను పరిశీలించినట్లయితే జస్టిన్ బైబర్స్ ‘బాయ్ ఫ్రెండ్' విడుదలైన తొలి రోజున 8 మిలియన్‌ల వీక్షణలను దక్కించుకోగలిగింది. సంచలనం దిశగా దూసుకుపోతున్స గ్యాంగ్‌నమ్‌స్టైల్ హీరో కొత్త వీడియో ‘జెంటిల్‌మ్యాన్'ను వీక్షించాలనుకుంటున్నారా..? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot