ఆండ్రాయిడ్ ఫోన్‌లకు KRACK Wi-Fi ముప్పు..

మీ ఇంట్లో వై-ఫై కనెక్షన్ ఉందా..? అయితే మీ వ్యక్తిగత డేటా ప్రమాదంలో ఉన్నట్లే. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించబడుతోన్న Wi-Fi encryption protocol WAP2లో ఓ లోపాన్ని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపా

|

మీ ఇంట్లో వై-ఫై కనెక్షన్ ఉందా..? అయితే మీ వ్యక్తిగత డేటా ప్రమాదంలో ఉన్నట్లే. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించబడుతోన్న Wi-Fi encryption protocol WAP2లో ఓ లోపాన్ని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు వై-ఫైతో కనెక్ట్ అయిన డివైస్‌ల్లోకి చొరబడి డేటాను దొంగిలించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

KRACK Wi-Fi flaw: Here’s all you need to know to stay protected

KRACK పేరుతో పిలవబడుతోన్న ఈ వల్నరబులిటీ WAP2 Wi-Fi protocol పై పూర్తిస్థాయిలో ప్రభావం చూపుతుందని, ఈ సమస్యను గుర్తించిన ప్రముఖ రిసెర్చర్ Mathy Vanhoef వెల్లడించారు. యూజర్ వై-ఫైకు కనెక్ట్ అయిన ప్రతిసారి అతని డేటాను హ్యాకర్లు రహస్యంగా చూసే వీలుందని ఆయన తెలిపారు.

KRACK vulnerability అంటే ఏంటి..?

KRACK vulnerability అంటే ఏంటి..?

క్రాక్ అంటే ‘కీ రీఇన్‌స్టాలేషన్ అటాక్' అని అర్థం. ఈ వల్నరబలిటీ ఫోర్-వే అథింటికేషన్‌లోని మూడవ స్టెప్‌ను టార్గట్ చేస్తుంది. అంటే మీ వై-ఫై క్లయింట్ డివైస్, ప్రొటెక్టెడ్ వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతోన్న సమయంలో ఈ దాడి చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఫోర్-వే అథింటికేషన్‌లోని మూడవ స్టెప్‌లో

ఎన్‌క్రిప్షన్ కీ అనేక సార్లు రీసెంట్ కాబడుతుంది. ఈ సమయంలోనే అటాకర్లు ఆ ఎన్‌క్రిప్షన్ కీని కలెక్ట్ చేసుకుని వై-ఫై సెక్యూరిటీ ఎన్‌క్రిప్ష‌న్‌ను బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా బ్రేక్ చేసినపుడు ఆ నెట్‌వర్క్ ద్వారా మీరు నిర్వహించుకునే ప్రతి ఆన్‌లైన్ లావాదేవీ హ్యాకర్లకు తెలిసిపోతుంది. వై-ఫైకు కనెక్ట్ అయ్యే ప్రతి డివైస్ KRACK Wi-Fi దాడికి దగ్గరగా ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు.

KRACK Wi-Fi flaw నుంచి రక్షణ పొందటం ఎలా?

KRACK Wi-Fi flaw నుంచి రక్షణ పొందటం ఎలా?

KRACK Wi-Fi flaw నుంచి మీ డివైస్‌ను రక్షించుకోవాలనుకుంటున్నట్లయితే మీ డివైస్‌లో సెక్యూరిటీ స్టాండర్ట్స్ అలానే సాఫ్ట్‌వేర్స్ అప్‌ టు‌ డేట్‌గా అప్‌గ్రేడ్ అయి ఉండాలి. ఇదే సమయంలో వై-ఫై నెట్‌వర్క్‌లకు పూర్తిగా దూరంగా ఉండాలి. వైరిడ్ ఇతర్నెట్ కనెక్షన్ లేదా మొబైల్ డేటా పై ఆధారపడటం మంచిది.

ఏఏ డివైస్‌లకు ముప్పు పొంచి ఉంది..?

ఏఏ డివైస్‌లకు ముప్పు పొంచి ఉంది..?

వాస్తవానికి వై-ఫైతో కనక్ట్ అయ్యే ఏ డివైస్ కైైనా KRACK Wi-Fi flaw పొంచి ఉంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ రిస్క్ ఎక్కువుగా ఉన్నట్లు రిసెర్చర్స్ చెబుతున్నారు. Android 6.0 ఆపై వర్షన్ పై రన్ అయ్యే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ ప్రమాదం ఎక్కువగా పొంచి ఉందట.

KRACK Wi-Fi flawను ఎదుర్కునేందకు అసవరమైన సెక్యూరిటీ ప్చాచ్‌ను ప్రస్తుతం iOS, watchOS, macOSల కోసం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు యాపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. KRACK Wi-Fi flawను ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ కూడా ఓ సెక్యూరిటీ ప్చాచ్‌ను విడుదల చేసింది. విండోస్ 10 యూజర్లను ఉద్దేశించి అక్టోబర్ 10న విడుదల చేసిన అప్‌డేట్‌లో ఈ ప్యాచ్ అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Get to know more about the KRACK Wi-Fi flaw that might put all your data at risk when you use Wi-Fi.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X