డెస్కటాప్‌ని త్రీడీ ఎఫెక్ట్‌లతో అందంగా తీర్చిదిద్దాలంటే ఇవిఉండాల్సిందే

By Super
|
Krento-Desktop Application
సాఫ్ట్‌వేర్‌, ఫోల్డర్‌, ఫైల్స్‌... ఏది ఓపెన్‌ చేయాలన్నా డెస్క్‌టాపే ప్రధాన వారధి. తెరపై అప్లికేషన్‌ గుర్తుల్ని వరుసగా సర్ది ఓపెన్‌ చేయడం పాత స్త్టెల్‌. వివిధ రకాల అదనపు సౌకర్యాలతో త్రీడీ ఎఫెక్ట్‌లతో ఓపెన్‌ చేసే విలువైన సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ ఉన్నాయి. అటువంటి వాటిల్లో ముఖ్యమైనవి మీకోసం ప్రత్యేకంగా...

KRENTO:

 

సైట్‌ నుంచి నిక్షిప్తం చేయగానే తెరపై గుర్తు కనిపిస్తుంది. ఓపెన్‌ చేసి Windows key+c నొక్కాలి. తెర మధ్యలో టాస్క్‌మెనేజర్‌, కంట్రోల్‌ ప్యానల్‌, డివైజ్‌ మేనేజర్‌, గూగుల్‌, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌... లాంటి సర్వీసులు ఓపెన్‌ అవుతాయి. వృత్తాకారంలో కదులుతూ త్రీడీ ఎఫెక్ట్‌తో ఆకట్టుకుంటాయి. బాణం గుర్తులతో వాటిని తిప్పుతూ కావాల్సిన అప్లికేషన్‌ను ఓపెన్‌ చేయవచ్చు.

 

SartMenu7:

పేరుకు తగినట్టే ఇది స్టార్ట్‌ మెనూకి అదనపు ఆప్షన్లను ఇస్తుంది. ఇన్‌స్టాల్‌ చేశాక అదనపు మెనూలు కనిపిస్తాయి. యూజర్‌ ఎకౌంట్‌ పేరు కూడా కనిపిస్తుంది. ప్రత్యేక మెనూలను స్టార్ట్‌లో పొందుపరచాలంటే ప్లస్‌ గుర్తుతో కనిపించే Add items into menuపై క్లిక్‌ చేయాలి. డిలిట్‌ చేయడానికి మైనస్‌ గుర్తు ఉంది. స్టార్ట్‌ మెనూ నుంచే కంట్రోల్‌ ప్యానల్‌లో అన్నింటిని పొందొచ్చు. Power Control మెనూలోకి వెళ్లి 'లాక్‌ యూజర్‌'తో తెరకు తాళం వేయవచ్చు. స్లీప్‌, లాగ్‌ఆఫ్‌, షట్‌డౌన్‌లను ఒకేచోట పొందొచ్చు. 'ఆప్షన్స్‌'లోకి వెళ్లి Skinsతో మెనూని నచ్చిట్టుగా మార్చుకునే వీలుంది. Enlarge, Recudce ఆప్షన్లతో మెనూ పరిమాణాన్ని కావాల్సినంత పెట్టుకోవచ్చు.

Appetizer:

కావాల్సిన అప్లికేషన్స్‌ని ఒకేబార్‌లో అందిస్తుంది. సిస్టంలోని అప్లికేషన్స్‌ని ప్రత్యేక టూల్‌బార్‌లో వచ్చేలా చేయవచ్చు. కావాల్సిన సాఫ్ట్‌వేర్లను టూల్‌బార్‌లో నిక్షిప్తం చేయాలంటే ప్లస్‌ గుర్తుపై క్లిక్‌ చేయండి. డ్రైవ్‌ల్లోని EXE ఫైళ్లను ఎంచుకోవాలి. కావాల్సిన ఫైళ్లను కూడా పొందుపరిచి ఎప్పుడైనా ఓపెన్‌ చేసుకోవచ్చు. Configuration పై క్లిక్‌ చేసి ఐకాన్ల పరిమాణం మార్చుకోవచ్చు. టూల్‌బార్‌ని నిలువు, అడ్డంగా మార్చుకునే వీలుంది. మీరే షార్ట్‌కట్‌ని పెట్టుకుని డాక్‌బార్‌ని యాక్సెస్‌ చేయవచ్చు. అప్లికేషన్‌ను ఓపెన్‌ చేశాక డాక్‌బార్‌ మాయం అవ్వాలంటే Auto hide after launching an applicationను చెక్‌ చేయండి.

SevenDeskbar:

విండోస్‌ సెవెన్‌ వాడుతుంటే మ్యాక్‌లో మాదిరిగా అప్లికేషన్స్‌, ఫైళ్లు, ఫోల్డర్లను డాక్‌ చేయవచ్చు. ఇన్‌స్టలేషన్‌ ప్రక్రియ లేకుండా ఫైల్‌ మాదిరిగా వాడుకోవచ్చు. దీన్ని రన్‌ చేయాలంటే సిస్టంలో dot Net (.Net) Framework 3.5 ఉండాలి.

Desklayer:

తెరపై ఒకటి కంటే ఎక్కువ విండోలను ఆటోమాటిక్‌గా విభజన చేయడం తెలుసా? 'డెస్క్‌లేయర్‌'తో ఇది సాధ్యమే. 'సెట్టింగ్స్‌'తో కావాల్సిన 'లేఅవుట్‌'ను సెలెక్ట్‌ చేసుకోవాలి. ఇక ఎన్ని విండోలను ఓపెన్‌ చేసినా తెరపై సరి సమానంగా విభజన అవుతాయి. 'లేఅవుట్‌ సెట్టింగ్స్‌'ని మార్చడం ద్వారా విండోల విభజన మార్చే వీలుంది.

ObjectDock:

మ్యాక్‌లో కనిపించే డాక్‌ బార్‌ విండోస్‌ పీసీలోనూ కనిపిస్తుంది. అందుకు 'ఆబ్జెక్ట్‌డాక్‌'ను నిక్షిప్తం చేసుకోండి. టాస్క్‌బార్‌పైనే త్రీడీలో కనిపిస్తూ అప్లికేషన్‌ ఐకాన్లను అందిస్తుంది. కావాల్సిన వాటిని డాకింగ్‌ చేయాలంటే బార్‌పై రైట్‌క్లిక్‌ చేసి Add-> Shortcut-> BlankShortను ఎంచుకోండి. బ్రౌజ్‌తో సిస్టంలోని సాఫ్ట్‌వేర్‌ EXE ఫైల్‌ను సెలెక్ట్‌ చేస్తే డాక్‌బార్‌లోకి వచ్చేస్తుంది. వ్యూ మెనూలోని Show all running windowsని చెక్‌ చేస్తే ఓపెన్‌ చేసిన అన్ని ఫోల్డర్లు, ఫైల్స్‌, అప్లికేషన్లు డాక్‌బార్‌లో చేరిపోతాయి. టాస్క్‌బార్‌ అక్కర్లేదనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి Hide the Windows Taskbarను చెక్‌ చేయండి.

Circle Dock:

తెర మధ్యలో వలయాకారంగా కావాల్సిన ఫోల్డర్లు, ఫైల్స్‌, అప్లికేషన్స్‌ని పొందుపరుచుకుని వాడుకోవాలంటే 'సర్కిల్‌ డాక్‌'ను నిక్షిప్తం చేసుకోండి. వృత్తంపై రైట్‌క్లిక్‌ చేసి Addతో అప్లికేషన్స్‌ని నిక్షిప్తం చేయవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X