ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఛైర్మన్ పోస్ట్ రేసులో కామత్, క్రిస్

Posted By: Super

ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఛైర్మన్ పోస్ట్ రేసులో కామత్, క్రిస్

బెంగళూరు: యస్ డి శిభులాల్ యాదవ్‌ని ఏప్రిల్ 30వ తారీఖు తర్వాత ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కొత్త సిఈవోగా నియమించాలని ఫారెన్ కంక్లూజన్ అభిప్రాయం. దీంతో త్వరలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సివోవో పోస్ట్ ఖాళీ అవనుంది. ఐతే ఇక్కడ సిఈవో కంటే కూడా ముఖ్యమైన టాపిక్ ఏమిటంటే ఇప్పటి వరకు సిఈవోగా ఉన్నటువంటి క్రిస్ గోపాల కృష్ణన్ రాబోయే కాలంలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో ఎటువంటి పాత్రని పోషించనున్నారనేది పెద్ద చర్చ.

ప్రస్తుతం నామినేషన్స్ కమిటీలో ఉన్నటువంటి ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కార్నల్ యూనివర్సిటీ ప్రోపెసర్ జెఫ్రరీ లెహమాన్ మాత్రం క్రిస్‌పై తనకు కొన్ని అంచనాలు ఉన్నయాని అంటున్నారు. అందుకే క్రిస్ ఛైర్మన్ ఫోస్ట్‌కు కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. ఇది మాత్రమే కాకుండా క్రిస్ ఇండస్ట్రీ బాడీ సిఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా కోనసాగుతున్నారు. అందుకు ముందు క్రిస్ స్దానంలో సిఐఐ ప్రెసిడెంట్ ఆది గోద్రెజ్ ఉన్నారు. సిఐఐ రూల్స్ ప్రకారం ప్రెసిడెంట్ అనేవాడు ఇండస్ట్రీలో యాక్టివ్ లీడర్‌గా ఉండాలి.

ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో బోర్డ్ సభ్యులుగా ఉన్నటువంటి ఇండియన్స్ ముఖ్యంగా పెద్ద ఆర్గనైజేషన్స్ నడుపుతూ ప్రిలిమినరీ కన్సల్టంట్స్‌గా ఓంకార్ గోస్వామి, శ్రీధర్ అయ్యంగార్ ఉన్నారు. గత వారంలో బోర్డ్‌లో కొత్తగా మాజీ మైక్రోసాప్ట్ ఇండియా ఛైర్మన్ రవి వెంకటేషన్ జాయిన్ అయ్యారు. ఇంకొక ముఖ్య వ్వక్తి దీపక్ శాట్వాలేకర్ యమ్‌డి అండ్ సిఈవో హెడి‌యఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ బోర్డ్ సభ్యులుగా కాకుండా నామినేషన్స్ కమిటీలో కూడా కోనసాగుతున్నారు. న్యూయార్క్‌లోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పనిచేస్తున్న మారుతి సుబ్రమణ్యం కూడా అకడమిక్ బోర్డ్ సభ్యులుగా ఉన్నారు.

జనవరి 2011వ సంవత్సరం తర్వాత బోర్డ్‌లో కొత్తగా జాయిన్ అయినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ ఛైర్మన్ కెవి కామత్, అశోక్ లైలాండ్ యమ్‌డి మరియు ఛైర్మన్ ఆర్ శెషాయి కూడా ఛైర్మన్ రేసులో ఉన్నప్పటికి వీరిద్దరు కొత్తగా చేరడం వల్ల వీరికి అవకాశం లేదు. ఐతే ప్రస్తుతానికి సివోవోగా శిభులాల్ యాదవ్‌ని అప్పుడే మార్చేది లేనిది ఏవిషయం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. దీనికి కారణం తర్వాత స్దానంలో ఉన్నటువంటి లీడర్స్ కొంచెం డి-మోటివేటెడ్ అవుతారనే ఉద్దేశ్యం.

చివరగా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఛైర్మన్ నారాయణ మూర్తి మాత్రం తన టీమ్‌ని సెలెక్ట్ చేసుకోవడంలో చాలా జాగ్రత్త వహిస్తున్నట్లు సమాచారం. దీనికి కారణం నారాయణ మార్తి తన జీవితం మొత్తం దారపోసి ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ అనే వృక్షాన్ని పెంచి పోషించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot