విడుదలకు ముందే స్మార్ట్‌ఫోన్‌లలోకి క్రిష్3!

Posted By:

ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా రాకేష్ రోషన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘క్రిష్ 3'. వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

విడుదలకు ముందే స్మార్ట్‌ఫోన్‌లలోకి  క్రిష్3!

ఈ నేపధ్యంలో ప్రముఖ గేమింగ్ సంస్థలు హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్, గేమ్ శాస్త్రాలు క్రిష్-3 పేరుతో సరికొత్త గేమింగ్ అప్లికేషన్‌ను వృద్ధి చేసింది. ఈ గేమ్ విండోస్ ఆధారిత డివైజ్ లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ గేమ్ బరువు 119 ఎంబి. విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల కొరకు ఈ అప్లికేషన్ తక్షణమే సిద్ధంగా ఉంది. డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

విండోస్ ఆధారిత ట్యాబ్లెట్స్ ఇంకా పర్సనల్ కంప్యూటర్ల కోసం ఈ గేమింగ్ అప్లికేషన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ముంబయ్ బ్యాక్‌డ్రాప్‌‍తో సాగే ఈ గేమ్‌లో మొత్తం 6 లెవల్స్ ఉంటాయి. ఈ గేమ్‌లో భాగంగా పోరాడేందుకు సినిమా పాత్రలైన క్రిష్, కాల్, కాయా ఇంకా ఫ్రాగ్‌మెన్ పాత్రలలో ఒక పాత్రను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot