3,500 కోట్ల రూపాయల ఆర్డర్‌ దక్కించుకున్న ఎల్‌ అండ్‌ టి

Posted By: Super

3,500 కోట్ల రూపాయల ఆర్డర్‌ దక్కించుకున్న ఎల్‌ అండ్‌ టి

చెనైకి చెందిన పీపీఎన్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థకు తమిళనాడులో గ్యాస్‌ బేస్డ్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పా టు చేసేందుకు రూ.3,500 కోట్ల ఆడర్డర్‌ దక్కినట్లు లార్సన్‌ అండ్‌ టుబ్రో తెలిపింది. పీపీఎన్‌ పవర్‌ జనరేటింగ్‌ కంపెనీని అపోలో గ్రూపు ప్రమోట్‌ చేసింది. తిమళనాడులోని నాగపట్టణంలో 3,336 మెగావాట్ల గ్యాస్‌ బెస్టేడ్‌ పవర్‌ప్లాంట్‌ ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టి ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన డిజైన్‌, ఇంజనీరింగ్‌, సప్లయ్‌, ఇన్‌స్టలేషన్‌, కమిషనింగ్‌ మొత్తం పవర్‌ ప్లాంట్‌ను టర్న్‌ కీ బేసిస్‌ ద్వారా సిద్దం చేసి ఇస్తారు.

జపాన్‌కు చెందిన మిత్సుబిషి హెవి ఇండస్ట్రీస్‌ నుంచి గ్యాస్‌ టరె్బైయిన్‌, స్టీమ్‌ టర్బయిన్‌లను ఎల్‌ అండ్‌ టి తెప్పిస్తోంది. ఎల్‌ అండ్‌ టి అనుబంధ సంస్థ ఎల్‌ అండ్‌ టి సార్జంట్‌ లుండీ ప్లాంట్‌ ఇంటిగ్రేషన్‌తో మొత్తం ఇంజనీరింగ్‌ పనులను అమెరికాకు చెందిన సార్జంట్‌ లుండీ ఎల్‌ఎల్‌సీ సహకారంతో పూర్తి చేస్తుంది. ప్రాజెక్టు మేనేజ్‌ మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌, ఇన్‌స్టలేషన్‌, కమిషనింగ్‌ను ఎల్‌ అండ్‌ టి పవర్‌ యూనిట్‌ బరోడా పూర్తి చేస్తుందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot