ఎల్‌ అండ్‌ టీ లాభం రూ. 1,686.21 కోట్లు

Posted By: Super

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ. 1,686.21 కోట్లు

ప్రముఖ నిర్మాణరంగ సంస్థ లార్సెన్‌ అండ్‌ టర్బో (ఎల్‌ అండ్‌ టీ) 2010-11 ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో 17.25 శాతం వృధ్ధిని నమోదు చేసింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.1,686.21 కోట్ల నికర లాభాలను సాధించింది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ.1,438.10 కోట్లని ఎల్‌ అండ్‌ టీ వర్గాలు వెల్లడించాయి. నికర అమ్మకాల పరంగానూ 2010-11 నాలుగో త్రైమాసికంలో 12.73 శాతం వృధ్ది చెంది రూ.15,078.39 కోట్లకు చేరుకున్నామని, అంతకుముందు ఏడాది రూ.13,374.89 కోట్లని సంస్థ పేర్కొంది.

ఇందులో అత్యధికశాతం ఇంజనీరింగ్‌, నిర్మాణ విభాగాల నుంచి వచ్చినదేనని, గతంలోకంటే ఈ విభాగాల నుంచి 12.85 శాతం అధికంగా రూ.13,664.31 కోట్లు రాబట్టగలిగామని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగాలలోనూ 1.32 శాతం వృధ్ధిరే టు నమోదు చేసి రూ.1,001.39 కోట్లు సాధించగలిగామని వివరించింది. అయితే 2010-11 ఆర్థిక సం వత్సరం మొత్తంగా చూస్తే..నికర లాభాల్లో 9.54 శాతం వాటాను కోల్పోయామని తెలిపిం ది. దీంతో 2009-10లో రూ.4,375.52 కోట్లున్న నికర లాభం 2010-11లో రూ.3,957.89 కోట్లకు దిగజారింది. ఇదిలావుంటే తాజా ఫలితాల నేపథ్యంలో బిఎస్‌ఈలోని ఎల్‌ అండ్‌ టీ షేర్‌ విలువ 5.83శాతం ఎగబాకింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot