ఫ్యాన్స్ కోసం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్

Posted By: Prashanth

ఫ్యాన్స్ కోసం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్

 

హాలీవుడ్ పాప్ తరంగం 'లేడిగాగా' తన ప్యాన్స్ కోసం ఎక్స్ క్లూజివ్‌గా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. 25 సంవత్సరాలు వయసు కలిగిన లేడిగాగా తన సెలబ్రిటీ హోదాని ప్రపంచం మొత్తం విస్తరించే భాగంగా అభిమానుల కోరిక మేరకు ఈ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌ని ఆరంభించింది. ఇది మాత్రమే కాదండోయ్ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ అయిన ట్విట్టర్‌లో 18 మిలియన్ ఫాలోవర్స్‌ని సొంతం చేసుకోని ప్రపంచ రికార్డుని నెలకొల్పింది.

టెక్నాలజీని పూర్తిగా తనకు అనుగుణంగా ఉపయోగించే సెలబ్రిటీలలో లేడిగాగా ముందుంటారని చెప్పవచ్చు. తన అభిమానులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు గాను.. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా రంగంలోకి ప్రవేశించాలనే ఉద్దేశ్యంతో లేడిగాగా ఫ్యాన్స్ కోసం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు. ఈ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌కు లేడిగాగా పెట్టిన పేరు 'లిటిల్ మోన్‌స్టర్స్(కొంచెం రాక్షసులు)'.

ఈ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌కి లిటిల్ 'మోన్‌స్టర్స్.కామ్‌' గా నామకరణం చేసారు. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన నిర్మాణాత్మక పనులు జరుగుతున్నయి. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న లేడిగాగా ఫ్యాన్స్ ఈ వెబ్‌సైట్ ద్వారా రిజస్టర్ చేసుకోవడమే కాకుండా..ఒకే తాటిపై నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో గాగా ఉన్నారు. ఈ వెబ్ సైట్‌లో అభిమానులు రిజస్టర్ అవ్వాలనుకుంటే వారియొక్క ఈ మెయిల్ అడ్రస్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.

రిజిస్ట్లేషన్ పూర్తి అయిన తర్వాత ఈ వెబ్‌సైట్ నుండి మీరు త్వరలోనే అధికారిక ఆహ్వానాన్ని పొందుతారని మేసేజ్ వస్తుంది. ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన ఖర్చు మొత్తం లేడిగాగా పెట్టారు. దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలను బ్యాక్‌ప్లేన్ కంపెనీ చూసుకుంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot