ఇక ల్యాండ్‌లైన్ ఫోన్‌ల నుంచి వీడియో కాలింగ్!

Posted By: Prashanth

ఇక ల్యాండ్‌లైన్ ఫోన్‌ల నుంచి వీడియో కాలింగ్!

 

న్యూఢిల్లీ: ల్యాండ్‌లైన్ ఫోన్‌ల నుంచి వీడియో కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ గురువారం న్యూఢిల్లీలో ప్రారంభించింది. ఇందుకుగాను ఎస్ఐఎస్ ఇన్ఫోసిస్టమ్స్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంది. దీనిలో భాగంగా ఒక్కో వీడియో కాల్ పై 45సెకన్లకు రూ.3 చార్జీని వసూలు చేయనుంది. ఈ విప్లవాత్మక మార్పుతో పబ్లిక్ కాల్ ఆఫీస్(పీసీవో)లు కాస్తా వీడియో కాల్ ఆఫీస్ (వీసీవో)లుగా మారిపోనున్నాయి.

ఈ వీసీవో ఫ్రాంజైజీలను రూ.25,000ధరకు కేటాయించనున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్‌కే ఉపాధ్యాయ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఫ్రాంచైజీ యజమానులకు 30శాతం కమీషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాలింగ్ సర్వీస్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గిస్తుందని వీసీవో సేవలను ప్రారంభించిన ప్రధాని సలహాదారు శ్యామ్ పిట్రోడా అన్నారు. ఉద్యోగ ఇంటర్వ్యూలు, టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్ వంటి వ్యాపార, విద్య, ఉద్యోగ ప్రయోజనాలకు ఈ సర్వీస్ లను ఉపయోగించుకోవచ్చని వివరించారు.

ప్రస్తుతం 770 పీసీవోలను వీసీవోలుగా మార్పుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ బ్రాడ్ బ్యాండ్ విభాగపు సీనియర్ జనరల్ మేనేజర్ ఏకే జైన్ తెలిపారు. దేశ వ్యాప్తంగా 10,000 వీసీవోలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్లు జైన్ వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot