Home
News

మీ ల్యాప్‌టాప్‌ ను స్లీప్ మోడ్ లో వాడుతున్నారా! అయితే ఇది తెలుసుకోండి!

By Maheswara

నేటి కాలంలో ఆఫీసు ఉద్యోగులు, విద్యార్థులు అందరూ ల్యాప్‌టాప్‌ లనే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి సౌకర్యవంతంగా, సౌలభ్యంగా ఉంటాయి. మరియు పోర్టబిలిటీ వంటి అనేక అంశాలు కారణంగా నేడు ప్రజలు ల్యాప్‌టాప్‌లను ముఖ్యమైన వస్తువుగా చూస్తున్నారు.

కానీ, ల్యాప్‌టాప్‌ని ఉపయోగించే వారు అందులో పని చేసుకున్న తర్వాత, షట్‌డౌన్ చేయకుండా నేరుగా దాన్ని మూసివేసి స్లీప్ మోడ్‌లో ఉంచడం మనం గమనిస్తుంటాము. మరి కొంతమంది సరైన పద్దతిలో షట్ డౌన్ చేసే అలవాటును అనుసరిస్తారు. ఈ రెండింటిలో ఏది సరైనది? ల్యాప్‌టాప్ జీవితాన్ని పొడిగించడానికి ఏ పద్ధతిని అనుసరించాలి అనే విషయాన్నీ ఇక్కడ తెలుసుకుందాం.

Laptop Tips & Tricks: Shutdown Or Sleep Mode In Laptop Which One Is Safe?  Which Mode Do You Prefer?

ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేయడం మంచిదా? లేక.. స్లీప్ మోడ్ లో పెట్టడం మంచిదా?

ల్యాప్‌టాప్‌ను కొంత సమయం వరకు వాడకుండా ఉంచినప్పుడు, దాని స్క్రీన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. దీన్ని స్లీప్ మోడ్ అని అంటారు. ఈ మోడ్‌లో స్క్రీన్ మాత్రమే ఆఫ్ అవుతుంది. కానీ,మిగతా అన్ని పనులు యధావిధిగా అలాగే ఉంటాయి. అలాగే, ల్యాప్‌టాప్ వాడుతున్నప్పటి కంటే స్లీప్ మోడ్‌లో తక్కువ బ్యాటరీ పవర్ ను వాడుతుంది.

కానీ, షట్‌డౌన్ మోడ్ ల్యాప్‌టాప్‌ యొక్క మొత్తం పనులను పూర్తిగా నిలిపివేస్తుంది. ల్యాప్‌టాప్ షట్ డౌన్ అయిన తర్వాత, దానిలోని ఏ భాగం పని చేయదు. మళ్లీ స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే ల్యాప్‌టాప్ మళ్లీ పని చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ రెండు మోడ్‌లలో ఏది మంచిది? మరి ఏది సురక్షితమో చూద్దాం?

తెలిసి, తెలియక వాడే 'ఈ' అలవాటు.! ఇది ల్యాప్‌టాప్‌కు ప్రమాదకరమైనది!

ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా వాడే వారు వేరే పనికి వెళ్లినప్పుడల్లా ల్యాప్‌టాప్‌ని స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తే, అప్పుడు వాడే అన్ని అప్లికేషన్‌లను షట్ డౌన్ చేయవచ్చు. కాబట్టి మీరు షట్‌డౌన్ ఎంపికను ఉపయోగించినప్పుడు, మీరు ఆపివేసిన చోట నుండి మీ పనులను కొనసాగించలేరు. దీంతో చాలా సమయం వృథా అవుతుంది.

Laptop Tips & Tricks: Shutdown Or Sleep Mode In Laptop Which One Is Safe?  Which Mode Do You Prefer?

కానీ, ల్యాప్‌టాప్ స్లీప్ మోడ్‌లో ఉన్నప్పుడు అన్ని భాగాలు యాక్టివ్‌గా ఉన్నందున, దాని సున్నితమైన ఎలక్ట్రానిక్ భాగాలు నిరంతరం వేడికి గురవుతాయి.ఇది ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంత త్వరగా చెడిపోయే లేదా విరిగిపోయే అవకాశం ఉంది.దీని వల్ల ల్యాప్‌టాప్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది.

ల్యాప్‌టాప్‌ ను ఆఫ్ చేసి ఉపయోగించవచ్చా? ఏది సరైన పద్ధతి? ఏది సురక్షితమైనది?

అయితే మనం ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేసినప్పుడు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్‌లు పనిచేయవు కాబట్టి, మీ ల్యాప్‌టాప్ జీవితకాలం పెరుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా, ఈ ల్యాప్‌టాప్‌ ను షట్‌డౌన్ చేయడం ద్వారా మరొక ప్రయోజనం ఏమిటంటే ఇది అనవసరంగా బ్యాటరీ ని వాడకుండా ఉంటుంది.

రెండింటిని పోల్చి చూస్తే, సాధారణ ల్యాప్‌టాప్ వినియోగదారులకు, ఆఫీస్ ఉద్యోగులకు స్లీప్ మోడ్ ఉత్తమం. ఎందుకంటే ఇది మీ పనిని మల్లి మొదలుపెట్టడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వారానికి ఒక్కసారైనా ల్యాప్‌టాప్‌ని షట్‌డౌన్ చేసి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.

అలాగే ప్రయాణాలలో ల్యాప్‌టాప్‌ని స్లీప్ మోడ్‌లో ఉంచడం కంటే షట్ డౌన్ చేయడం మంచిది. ల్యాప్‌టాప్ ఆన్‌లో ఉంచుకుని ప్రయాణిస్తున్నప్పుడు, ట్రిప్ వైబ్రేషన్‌ల వల్ల ఆపరేషన్‌లో ఉన్న భాగాలూ సులభంగా దెబ్బతింటాయి. కాబట్టి మీరు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే ల్యాప్‌టాప్‌ని షట్‌డౌన్ చేసి మీతో తీసుకెళ్లడం మంచిది.

Best Mobiles in India

English summary
Laptop Tips & Tricks: Shutdown Or Sleep Mode In Laptop Which One Is Safe? Which Mode Do You Prefer?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X